MBNR: జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా, కొల్లూరును మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రేపు నిర్వహించతలపెట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. దీనికి పిలుపునిచ్చిన సాధన సమితి నేతలు డాక్టర్ రమేశ్ నాయక్, కృష్ణ యాదవ్‌లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. జడ్చర్ల రూరల్, అర్బన్ మండలాల ఏర్పాటును కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.