NZB: మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీజీఆర్టీసీ బస్సు కండక్టర్ హనుమంతుపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఎస్సై సుస్మత కేసు నమోదు చేశారు. నర్సింగ్ పల్లి సమీపంలో బస్సు ఆపాలని ప్రయాణికుడు గొడవకు దిగి కండక్టర్పై దుర్భాషలాడుతూ కర్రతో దాడి చేసి గాయపరిచాడు. డ్రైవర్, కండక్టర్లను దూషిస్తూ బస్సు ప్రయాణాన్ని అడ్డుకున్నారు. దాడి చేసిన సురేశ్, బాబయ్య పై ఎస్సై ఆదివారం కేసు నమోదు చేశారు.