• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శాంసన్ కంటే బుమ్రా అర్హుడు: ABD

టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’కు బుమ్రా పూర్తి అర్హుడని దిగ్గజ ప్లేయర్ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. తన వరకు అయితే సంజూ శాంసన్ కంటే కూడా బుమ్రాకు ఆ అవార్డు ఇవ్వాల్సిందని పేర్కొన్నాడు. ఈ టోర్నీ మొత్తం బుమ్రా అద్భుత బౌలింగ్ చేశాడని, ముఖ్యంగా సెమీస్, ఫైనల్స్‌లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేశాడన్నాడు. అతడు భారత క్రికెట్‌కు విలువైన ఆస్తి అని తెలిపాడు.

March 12, 2026 / 03:10 PM IST

ఇంటర్ పరీక్షలకు 98.25% విద్యార్థులు హాజరు

KMR: బిచ్కుంద మండలంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. నేడు జరిగిన కెమిస్ట్రీ, కామర్స్ తదితర పరీక్షలకు 286 మంది విద్యార్థులకు గాను 281 మంది విద్యార్థులు హాజరు కాగా, అయిదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 98.25% విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

March 12, 2026 / 03:09 PM IST

హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన పోలీసులు

HNK: దామెర మండలంలోని ఒగ్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు దామెర పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎస్సై అశోక్, తదితరులు ఉన్నారు.

March 12, 2026 / 03:08 PM IST

నెట్ ఫ్లిక్స్‌తో నా కల నిజం కానుంది: రేవంత్

TG: నెట్ ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతుందని CM రేవంత్ వ్యాఖ్యానించారు. నెట్ ఫ్లిక్స్, ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు పూర్తిగా సహకరిస్తామన్నారు. నెట్ ఫ్లిక్స్ విస్తరణకు కావాల్సిన భూమిని ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని పేర్కొన్నారు. 500 పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తామన్నారు.

March 12, 2026 / 03:07 PM IST

వేరుశనగ క్వింటాలకు ధర రూ.8,546

MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఇశాళ వేరుశనగ అత్యధికంగా రూ.8546 పలికిందని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాజ పాషా తెలిపారు. అతి తక్కువగా రూ.4000 పలికిందని సూచించారు. మొత్తానికి 1500 క్వింటాళ్ల వేరుశనగ మార్కెట్‌కు వచ్చిందన్నారు. మొక్కజొన్న 459 క్వింటాళ్లు వచ్చాయని వెల్లడించారు. కందులకు రూ.7,285 ధర పలికిందన్నారు.

March 12, 2026 / 03:06 PM IST

ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కృష్ణా: గుడివాడ రాజేంద్రనగర్‌లోని వైసీపీ కార్యాలయంలో 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మాట్లాడుతూ.. వైసీపీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత ఉత్సాహంగా తీసుకెళ్లేందుకు అందరూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలన్నారు.

March 12, 2026 / 03:05 PM IST

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఫోటో ప్రదర్శన

SRPT: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం సందర్శించారు. స్థానిక రవి మహల్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

March 12, 2026 / 03:01 PM IST

మద్యం కేసు.. ముప్పిడి అవినాష్‌రెడ్డికి చుక్కెదురు

AP: మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఛార్జిషీట్ వేశాక కూడా నిందితులను కస్టడీకి ఇవ్వొచ్చని స్పష్టం చేసిన త్రిసభ్య ధర్మాసనం.. ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అవినాష్‌ను కస్టడీకి ఇచ్చే విషయంపై ట్రయల్ కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేస్తూ, తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

March 12, 2026 / 03:01 PM IST

‘అన్న క్యాంటీన్లపై ప్రజలు సంతృప్తి చెందాలి’

KRNL: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ గురువారం అన్న క్యాంటీను పరిశీలించి, ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తి చెందేలా సేవలందించాలని ఆదేశించారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై ఆయనఆరా తీశారు. నోడల్ అధికారులకు భోజనం తాజాగా, శుభ్రంగా ఉండేలా ప్రతిరోజూ పరిశీలించి, తాగునీరు, స్వచ్ఛత వంటి సదుపాయాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

March 12, 2026 / 03:00 PM IST

మిట్టమీదపల్లెలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

అన్నమయ్య: రాజంపేట మండలం మిట్టమీదపల్లె గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు గురువారం నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ గన్నె సుబ్బ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 03:00 PM IST

కైకలూరులో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ELR: కైకలూరు ప్రధాన సెంటర్లో గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు వైసీపీ జెండాను ఆవిష్కరించి వైఎస్‌ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. 15వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

March 12, 2026 / 03:00 PM IST

కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు

TG: మాజీ మంత్రి కేటీఆర్‌ను లైసెన్స్‌డ్ సర్వేయర్లు కలిశారు. ప్రభుత్వం తమకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందనిఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్‌ను కోరారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 5వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

March 12, 2026 / 03:00 PM IST

జాతీయ స్థాయి వీల్ చెయిర్ ఫెన్సింగ్ పోటీలకు SVR విద్యార్థి

NDL: నంద్యాల మండలం అయ్యలూరుమెట్ట వద్ద ఉన్న SVR ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి పీ. భరత్ కుమార్ వీల్ చెయిర్ ఫెన్సింగ్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ఎం.డీ. దినేష్ రెడ్డి గురువారం తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ క్రమంలో విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు.

March 12, 2026 / 03:00 PM IST

గోపే ఎడ్వర్డ్ రాజుకి ఏఎన్‌యూ నుంచి డాక్టరేట్ పట్టా

ఉండి మండలం ఉణుదురు శివారు సాగపాడుకు చెందిన గోపే ఎడ్వర్డ్ రాజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా లభించింది. ఫార్మాస్యూటీ కల్ సైన్సెస్ విభాగంలోని డాక్టర్ P. శ్రీకాంత్ పర్యవేక్షణలో రాజు తన పరిశోధన పూర్తి చేశాసారు. యాంటివైరల్ ఔషాదాలపై విశ్లేషణాత్మక, బయోఅనలిటీకల్ పద్ధతులు అభివృద్ధి ప్రమాణీకరణ, ఫార్మోకోకైనెటిక్ అధ్యాయనాలుపై చేశారు.

March 12, 2026 / 03:00 PM IST

నెల్లూరు జడ్పీలో ఇద్దరికి ప్రమోషన్

నెల్లూరు జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ సహాయకులకు ప్రమోషన్ వచ్చింది. ఎం.శ్రీలత, ఎన్.విజయలతను పరిపాలనా అధికారులుగా నియమించారు. జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈవో శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా గురువారం వారికి నియామక పత్రాలు అందజేశారు. అలాగే, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

March 12, 2026 / 03:00 PM IST