BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు మంచి అవకాశం అని కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన శిక్షణ తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలకం అనే భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అన్నారు.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించాలని, సాధారణ షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 అదనంగా పెంచుకోవాలని కోరినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
ASR: ముంచంగిపుట్టు మండలంలోని లబురు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వంటగది, ప్రహరి గోడ, డైనింగ్ హాల్, త్రాగునీటి సదుపాయం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
TG: మహిళా సర్పంచ్‌ల భర్తలు పెత్తనం చేయొద్దని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. ‘మహిళా సర్పంచ్లు ప్రొటోకాల్ విస్మరించకుండా జాగ్రత్త వహించాలి. జనరల్ బాడీ మీటింగ్‌లలో టైం పాస్ చేయొద్దు.అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. పార్టీలతో సంబంధం లేకుండా సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి’ అని అన్నారు.
TVK పార్టీ అధినేత విజయ్ ఆఖరి చిత్రం ‘జననాయగన్’ చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు మరో భారీ షాక్ తగిలింది. ఈ మూవీ ఓటీటీ ఒప్పందాన్ని అమెజాన్ ప్రైమ్ రద్దు చేసుకుంది. సెన్సార్ వివాదాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందన్న కారణంతో ఆ సంస్థ ఈ డీల్ నుంచి తప్పుకుంది. కాగా, ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ రూ.120 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసింది.
NGKL: జిల్లాలో 18వ వార్డు బస్తీ దవాఖానలో గురువారం ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. గర్భిణీలు, స్థానిక ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.
VSP: అమరావతి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. అలాగే, జిల్లా అభివృద్ధికి సంబంధించి కార్యాచరణను వివరించారు.
GDWL: పట్టణాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను అమలు చేస్తోందని నోడల్ అధికారి నారాయణరావు తెలిపారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే పట్టణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
SDPT: దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అల్వాల ఎక్స్ రోడ్ చెప్యాల వద్ద ఉన్న పీఎంశ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ పనులను MLA కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాఠశాలలోని డార్మెటరీలు, శౌచాలయాలను పరిశీలించారు. దీంతో అక్కడి అపరిశుభ్రత గురించి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
NZB: జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొద్దిసేపు వివిధ అంశాలపై బోధించారు. గురువారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాగా చదువుకొని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదని కలెక్టర్ తెలిపారు.
NLG: నల్గొండ టౌన్ బస్టాండ్ సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆక్సిజన్ అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: నల్గొండ టౌన్ బస్టాండ్ సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆక్సిజన్ అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం ఏప్రిల్ 23 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సగం రోజు మాత్రమే పని చేస్తాయి. ఉ. 8:00 నుంచి మ.12:30ల వరకు తరగతులు నిర్వహించి, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తారు. టెన్త్ పరీక్ష జరిగే రోజు మాత్రమే మ. 1.00 నుంచి సా. 5.00 వరకు తరగతులు నడుస్తాయని డీఈవో బిక్షపతి గురువారం తెలిపారు.
MNCL: ఎండల తీవ్రత పెరగడంతో జన్నారం మండలం నిప్పుల కొలిమిలా మారింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మండలంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అయితే తీవ్రత మాత్రం 42 డిగ్రీలుగా ఉండడంతో ప్రజలు ఒక్కరి బిక్కిరి అయ్యారు. ఉదయం నుంచి మండలంలోని పలు గ్రామాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లు నిర్మాణస్యంగా మారాయి.
టాలీవుడ్‌లో ఈ వారం సందడి లోపించింది. మార్చి రెండో వారంలో ఒక్క కొత్త సినిమా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. గత వారం వచ్చిన మూవీలు ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో థియేటర్ల వద్ద జనం తగ్గారు. దీంతో పాత సినిమాలే తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నాయి. అయితే మార్చి 19న ఉగాది సందర్భంగా రానున్న భారీ సినిమాలపైనే ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలన్నీ ఉన్నాయి. అప్పటివరకు బాక్సాఫీస్ వెలవెలబోనుంది.