ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి, ఉక్కబోతలు పెరుగుతాయి. ఉపశమనానికి చాలా మంది ఏసీలను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వర్క్ ప్లేస్‌లలో ఉద్యోగులైతే ఏసీ రూముల్లో గడుపుతుంటారు. కానీ అందరి శరీరతత్వం ఒకే విధంగా ఉండదు. కొందరికి ఏసీ పడకపోయినా.. ఎక్కువ సేపు ఏసీ గదిలో ఉన్నా అలర్జీలకు గురికావచ్చు. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేస్తే.. అదే ఆరోగ్య సమస్యగా మారవచ్చని నిపుణులు అంటున్నారు.
JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి సుజాత గురువారం తనిఖీ చేశారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో CPR చేసే విధానంపై ఎస్ఈడీ స్క్రీన్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ లింగాపూర్ గ్రామంలో ఇవాళ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 103 మందికి బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వేసవికాలంలో ప్రజలు తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలను వైద్యులు వివరించారు. సింగరేణి అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
NZB: అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో ఇందల్వాయి రైల్వేగేట్ ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గేట్ మూసివేయనున్నట్లు చెప్పారు. ఇందల్వాయి నుంచి ధర్పల్లి, సిరికొండ, భీమ్గల్ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు డిచ్పల్లి, కమలాపూర్, తిర్మన్పల్లి మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని అధికారులు సూచించారు.
AP: ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరేనని.. మరి రంజాన్ తోఫా సంగతేంటి చంద్రబాబు? ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. అధికారం ఇచ్చిన వెంటనే చంద్రన్న తోఫా అన్నారు కదా? అని ఆమె గుర్తు చేశారు. పేద ముస్లింల భరోసా అని చెప్పారు కదా? అని నిలదీశారు. తోఫా ఇవ్వనందుకు జగన్‌కి ముస్లింలు బుద్ధి చెప్పారని విమర్శించారు. మరి మీకెలా చెప్పాలి బుద్ది అని నిలదీశారు.
RR: చేవెళ్ల పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు అగ్నిమాపక భద్రతపై అవగాహన కల్పించేందుకు ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటిని ఎలా నివారించాలనే విషయాలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో అగ్ని ఎలా అదుపులోకి తేవాలని ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు.
ప్రకాశం: చీమకుర్తి మండలం బుదవాడలో పంచాయతీ సిబ్బంది ఇంటి పన్నులు వసూలు చేశారు. జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటి పన్నులు వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు.
WGL: నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో SC సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
VKB: ఎండల వేడిమితో పాఠశాల విద్యార్థులు తట్టుకోలేరని ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 16 నుంచి ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నామని ఎంఈవో అభిబ్ హమద్ తెలిపారు. కుల్కచర్ల మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. ఈనెల 14 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు.
SRCL: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీపీహెచ్‌సీని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, మందుల గది, ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు. వ్యాక్సిన్లు, మందుల నిలువుపై ఆరా తీశారు.
సత్యసాయి: కదిరి రథోత్సవంలో జరిగిన తోపులాటలో ఒక వృద్ధురాలిని కాపాడబోయి కుమార్ అనే యువకుడు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్, రాష్ట్ర ఆక్టివిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి కుమార్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. యువకుడి ధైర్యాన్ని, సేవాభావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
TPT: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తిరుపతి జిల్లాలో మొత్తం 84 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో నమోదైన 4,973 మంది విద్యార్థుల్లో 4,660 మంది పరీక్షలకు హాజరయ్యారని RIO రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మొత్తం 313 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు వెల్లడించారు.
TPT: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తిరుపతి జిల్లాలో మొత్తం 84 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో నమోదైన 4,973 మంది విద్యార్థుల్లో 4,660 మంది పరీక్షలకు హాజరయ్యారని RIO రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మొత్తం 313 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు వెల్లడించారు.
డయాబెటిస్ ఉన్నవారు ఉదయం టీ/కాఫీలో చక్కెర బదులు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవడం లేదా దాల్చిన చెక్క పొడి కలిపిన నీళ్లు తాగడం మంచిది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడం ద్వారా ఉబ్బరం, గ్యాస్, అజీర్ణాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.
TG: కేవలం నెలకు రూ.500కే అద్దెకు కూలర్లు లభిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రధాన నగరాల్లో ఇలాంటి ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. వేసవికాలం వస్తుండటంతో నగరంలో ఈ అద్దె కూలర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆర్థిక స్తోమత లేని సామాన్య కుటుంబాలు కూలర్లను అద్దెకు తెచ్చుకుంటున్నారు.