• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మహిళా శక్తి దేశాభివృద్ధికి ఎంతో ముఖ్యం’

NDL: మహిళలు సమాజ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. న్యూ ఢిల్లీలోని సౌత్ అవెన్యూలో లోక్ సభ సభ్యురాలు మంజు శర్మ నివాసంలో నిర్వహించిన రాష్ట్ర సేవికా సమితిలో ఇవ్వాల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళా శక్తి దేశాభివృద్ధికి ఎంతో ముఖ్యమన్నారు. మహిళా చైతన్యం కోసం కలిసికట్టుగా పని చేద్దాం అని ఆమె పిలుపునిచ్చారు.

March 12, 2026 / 02:00 PM IST

డ్రైనేజీ నిర్మాణ కాలువలు పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ న౦దన్ గురువారం నగరంలోని 45, 46 డివిజన్లలోని పొగతోట, గాంధీనగర్, సాయిబాబా గుడి ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగం నిర్దేశించిన మార్కింగ్ మేరకు పనులు చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన అధికారులకు సూచించారు.

March 12, 2026 / 02:00 PM IST

జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న నిశాంత్ కుమార్

అన్నమయ్య: అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సులో సీఎం నారా చంద్రబాబు  పెట్టుబడుల ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాల ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు, టూరిజం, ఐటీ, ఎంఎస్ఎంఈలు వంటి రంగాలను ప్రోత్సహించాలని సీఎం తెలిపారు.

March 12, 2026 / 02:00 PM IST

గుండెపోటుతో బీఆర్ఎస్ నాయకుడు మృతి

NZB: ధర్పల్లికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు జి.కిషోర్ రెడ్డి (42) గురువారం కన్నుమూశారు. ఉదయం పొలం వద్ద వాకింగ్ ముగించుకుని వచ్చి నిద్రపోయిన ఆయన, ఎంతకీ లేవకపోవడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

March 12, 2026 / 02:00 PM IST

‘దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి’

KMR: ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

March 12, 2026 / 02:00 PM IST

‘క్రీడాకారులను జాతీయస్థాయిలో ప్రోత్సహించాలి’

WNP: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి వనపర్తి డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

March 12, 2026 / 02:00 PM IST

యోగి వేమన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ రాక

KDP: ఈనెల 13న యోగి వేమన విశ్వవిద్యాలయం 11, 12, 13, 14వ స్నాతకోత్సవాలు డీ.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఛాన్సలర్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఏర్పాట్లను పరిశీలించారు. జేసీ వెంట రాజంపేట సబ్ కలెక్టర్ భావన తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 02:00 PM IST

కర్నూలులో 261 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు

KRNL: గురువారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 4,590 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 4,329 మంది మాత్రమే పరీక్ష రాశారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

March 12, 2026 / 02:00 PM IST

తాడేపల్లిగూడెంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

W.G: తాడేపల్లిగూడెంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు హాజరయ్యారు. అనంతరం వైసీపీ జెండాను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోదీ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల బంగారు భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు.

March 12, 2026 / 02:00 PM IST

ఈ-స్టోర్ విధానంతో విద్యుత్ పనులు వేగవంతం: ఎస్ఈ

PDPL: విద్యుత్ శాఖలో ఈ-స్టోర్ విధానం అమలుతో పనులు వేగవంతమవుతున్నాయని సూపరింటెండెంట్ ఇంజినీర్ గంగాధర్ తెలిపారు. అవసరమైన విద్యుత్ సామగ్రిని ఆన్‌లైన్‌లో ముందుగా బుక్ చేసుకుని వెంటనే వినియోగించుకునే సౌకర్యం కల్పించడంతో క్షేత్రస్థాయిలో పనులు సులభతరమయ్యాయని, ట్రాన్స్ ఫార్మర్ మార్పులు, లైన్ మరమ్మతులు త్వరగా పూర్తై వినియోగదారులు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు.

March 12, 2026 / 02:00 PM IST

ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

NLG: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో శ్రీఈద్దమ్మ తల్లి, శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని వేడుకున్నారు.

March 12, 2026 / 02:00 PM IST

ధర్మవరంలో టెన్త్ పరీక్షా కేంద్రాల పరిశీలన

సత్యసాయి: ధర్మవరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి కార్యాలయ ఇంఛార్జ్ హరీష్ బాబు అధికారులను ఆదేశించారు. మంత్రి సత్యకుమార్ సూచన మేరకు గురువారం పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్, జి.వి.ఇ. పాఠశాలలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా గదుల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వసతులపై దిశానిర్దేశం చేశారు.

March 12, 2026 / 02:00 PM IST

పశ్చిమాసియాకు 58 విమాన సర్వీసులు!

ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు మార్చి 12న పశ్చిమాసియాకు 58 షెడ్యూల్, నాన్-షెడ్యూల్డ్ విమానాలను నడుపుతున్నాయి. ముంబై, కోజికోడ్ నుంచి రియాద్, జెడ్డా, మస్కట్ వంటి నగరాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన అన్ని అనుమతులతో నడుస్తున్న ఈ రెగ్యులర్, స్పెషల్ సర్వీసులు గల్ఫ్ ప్రయాణికులకు ఊరటనివ్వనున్నాయి.

March 12, 2026 / 01:56 PM IST

BIG NEWS: విద్యార్థులకు గుడ్‌న్యూస్

TG: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 16 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. రోజురోజుకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హాఫ్ డే స్కూల్స్ పెట్టాలని నిర్ణయించింది.

March 12, 2026 / 01:53 PM IST

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరిక

MBNR: చిన్నచింతకుంట మండలం బండ్రవల్లి సర్పంచ్ బత్తుల సుజాత వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి గెలుపొందిన ఆమె.. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లోకి వచ్చారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

March 12, 2026 / 01:51 PM IST