WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25వ వార్డులో గురువారం పారిశుద్ధ పనులను టీపీసీసీ సభ్యుడు పెండం రామానంద్ పరిశీలించారు. మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
KDP: పులివెందుల నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి గురువారం మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల వినతులను మంత్రికి అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో సమీక్షించి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
నటి రాధికా శరత్ కుమార్ మూవీ టికెట్ల ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘తాయి కిళవి’ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. కేవలం రూ.150 టికెట్‌తోనే తమ మూవీ రూ.60 కోట్లు వసూలు చేసిందని తెలిపింది. కొందరు స్టార్ హీరోలు టికెట్ ధరలను రూ.1500-2000 వరకు పెంచుతున్నారని, ఆ లెక్కన చూస్తే తక్కువ ధరతో ఎక్కువ వసూళ్లు సాధించిన తమదే అసలైన విజయమని స్టార్ హీరోలకు పరోక్షంగా చురకలు అంటించింది.
W.G: తణుకు సొసైటీ రోడ్డులోని వైయస్సార్ పార్క్ వద్ద మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. గురువారం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ పార్కు బోర్డు సైతం శిథిలావస్థకు చేరిందని తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ASR: డుంబ్రిగూడలో ఐవీఆర్‌ఎస్ విధానంపై అవగాహన సదస్సును మండల సర్వేయర్ రమేష్ నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలను ప్రజలకు త్వరగా, సులభంగా అందించేందుకు ఐవీఆర్‌ఎస్ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రజలు ఫోన్ కాల్ ద్వారా అవసరమైన సమాచారం పొందడంతో పాటు వివిధ సేవలపై ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
MLG: 2026-27 విద్యా సంవత్సరానికి ఐటీడీఏ పరిధిలోని క్రీడా పాఠశాలల్లో 5వ తరగతి (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు DD జనార్దన్ తెలిపారు. బోయినపల్లి వాటర్ స్పోర్ట్స్ స్కూల్, కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో 9-11 ఏళ్ల గిరిజన విద్యార్థులు మార్చి 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
VZM: జిల్లాలో కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను అధిక వడ్డీ రేట్లతో వేధిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం హెచ్చరించారు. కాల్‌మనీ పేరుతో సాధారణ ప్రజలను మోసం చేయడం, అధిక వడ్డీలు వసూలు చేయడం, అప్పు తీసుకొన్న వారిని బెదిరించడం ఆస్తులను జప్తు చేయడం చట్టవిరుద్ధం అని ఎస్పీ తెలిపారు. ప్రజలు డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు.
ADB: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని గుడిహత్నూర్ మండల పరిధిలో యువతిని మోసం చేసిన ఆత్రం గణపతి, సలాం వరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బాధితురాలి నుంచి రూ.15 వేలు వసూలు చేయగా, ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్యోగాల పేరుతో నమ్మించే మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు.
MNCL: బీజేపీ తెలంగాణ మీడియా ప్యానలిస్టుగా మంచిర్యాలకు చెందిన అడ్వకేట్ తులా ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంజనేయులు విద్యార్థి ఏబీవీపీ, బీజేవైఎంలో అనేక పదవులు నిర్వహించారు. తెలంగాణ మీడియా ప్యానలిస్టుగా నియమించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
JGL: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను ధరూర్ గ్రామ యాదవ సంఘం సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
KMM: సింగరేణి మండలం తొడితలగూడెం గ్రామ నివాసి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దబోయిన ప్రశాంత్ తండ్రి ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్‌లో అనారోగ్యం తో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గురువారం ఆసుపత్రికి వెళ్లి ప్రశాంత్ తండ్రిని పరామర్శించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఈనెల 23న ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు ముర్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, రూ.1.35 లక్షల కోట్లతో రెండు దశల్లో 5,300 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే.
NDL: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టేది వైసీపీ నేనని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దీమా వ్యక్తం చేశారు. బనగానపల్లె పట్టణంలో పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అధికార పార్టీ వర్ధిల్లాకు భయపడాల్సిన పనిలేదని,కార్యకర్తలు ధైర్యం చెప్పాడు.
KNR: రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KMR: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన మాజీ జడ్పిటీసీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అంతిమయాత్రలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని తన మానవత్వాన్ని చాటుకున్నారు. మోహన్ రెడ్డి గారి చివరి మజిలీలో షబ్బీర్ అలీ వారి నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పూలగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.