• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ అధికారులు అర్చకులు కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఉగాది మహోత్సవాల ఆహ్వాన పత్రికను వారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అందజేశారు. అనంతరం వారు మంత్రిని ఘనంగా సన్మానించారు.

March 14, 2026 / 12:17 PM IST

వేయించిన శనగపప్పుతో షుగర్‌కు చెక్

వేయించిన శనగపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.

March 14, 2026 / 12:15 PM IST

జూన్ నాటికి నివాసాల పనులు పూర్తి: మంత్రి

AP: ఈ ఏడాది జూన్ నాటికి రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నతాధికారులు, MLAలు, MLCల కోసం నిర్మిస్తున్న నివాసాల పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుతం 30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 2028 డిసెంబర్ నాటికి రాజధానిలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని చెప్పారు.

March 14, 2026 / 12:15 PM IST

వినతి పత్రాల స్వీకరించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి స్వామి ఇవాళ వినతి పత్రాలు స్వీకరించారు. పలువురు తమ సమస్యలను వివరించారు. మంత్రి, సంబంధిత అధికారులతో ఆ సమస్యలపై మాట్లాడి పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా తాను కృషి చేస్తానని మంత్రి అన్నారు.

March 14, 2026 / 12:14 PM IST

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్

KRNL: కర్నూలు జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ సిరి ఇవాళ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం ప్రత్యేకంగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్యాస్ బుకింగ్‌పై సందేహాలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

March 14, 2026 / 12:13 PM IST

కేంద్రమంత్రికి సీతక్క కృతజ్ఞతలు

TG: కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిని మంత్రి సీతక్క కలిశారు. నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను కేంద్రం ఎంపిక చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లాలో మహిళలు, బాలికలకు భద్రత, గౌరవం పెరుగుతాయని సీతక్క పేర్కొన్నారు. అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టును అమలు చేసేందుకు డీపీఆర్ తయారు చేస్తున్నట్లు వివరించారు.

March 14, 2026 / 12:13 PM IST

జర్నలిస్టుల సంక్షేమానికి నా పూర్తి మద్దతు: ఎమ్మెల్యే

MBNR: జర్నలిస్టుల సంక్షేమం, వారి కుటుంబాల ఆరోగ్య భద్రతకు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. శనివారం దేవరకద్రలో టీయూడబ్ల్యూజే ప్రతినిధులు ఆయనను కలిసి హెల్త్ కార్డుల సమస్యపై వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ సహాయంతో పాటు తన వంతుగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

March 14, 2026 / 12:13 PM IST

ఉండిలో జనసేన ఆవిర్భావ దినోత్సవం

W.G: మండల కేంద్రం అయిన ఉండిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంధాలయం చైర్మన్, ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి జుత్తిగ నాగరాజు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతీ జనసేన సైనికులకు తప్పనిసరి గుర్తింపు లభిస్తుంది అన్నారు.

March 14, 2026 / 12:13 PM IST

10వ తరగతి పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు

CTR: 10వ తరగతి పరీక్షలకు సంబంధించి పుంగరులో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు MEO నటరాజ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 16నుంచి ఏప్రిల్ 1 వరకు తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పట్టణంలోని 8 కేంద్రాలలో 1512 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను విద్యార్థులకు తమ పాఠశాలల్లో అందిస్తున్నట్లు తెలిపారు. 

March 14, 2026 / 12:11 PM IST

అజిత్‌కు మహీంద్రా స్పెషల్ గిఫ్ట్

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‌కు రేసింగ్‌పై ఉన్న మక్కువను గౌరవిస్తూ మహీంద్రా సంస్థ సరికొత్త ‘BE 6’ ఫార్ములా ఈ-థీమ్ SUVని బహుమతిగా అందించింది. ప్రపంచంలోనే మొదటి ఈ-థీమ్ ఎస్యూవీగా నిలిచిన దీని విలువ సుమారు రూ.30 లక్షలుగా సమాచారం. మహీంద్రా ఆటో హెడ్ వేలుస్వామి స్వయంగా ఈ కారును అజిత్‌కు అందజేశాడు. ఈ ప్రత్యేక లాంచ్ కార్యక్రమంలో అజిత్ పాల్గొని సందడి చేశాడు.

March 14, 2026 / 12:10 PM IST

పకడ్బందీగా కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు

NLG: చిట్యాలలో పదవ తరగతి పరీక్షలు అత్యంత పకడ్బందీగా కొనసాగుతున్నాయి. విద్యాశాఖ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, ప్రతి సెంటర్ వద్ద హెల్ప్ లైన్ నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

March 14, 2026 / 12:09 PM IST

గ్రామాల్లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు: మంత్రి

AP: రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తుళ్లూరు ఎమ్మెల్యే శ్రవణ్, CRDA అధికారులతో కలిసి ఆయన అనంతవరం, నెక్కలు గ్రామసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలపై ప్రజలకు వివరిస్తూ.. పనులను ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తిచేస్తామని, అండర్ గ్రౌండ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్డు వేస్తామన్నారు.

March 14, 2026 / 12:08 PM IST

భీమన్న సన్నిధిలో జడ్చర్ల ఎమ్మెల్యే పూజలు

SRCL: వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు స్వస్తి వచనాలతో ఘనంగా స్వాగతించారు. అనంతరం ఆయన స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 14, 2026 / 12:07 PM IST

‘గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది’

AP: సింహాచలం స్వామివారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. చందనోత్సవం, స్వామివారి కల్యాణోత్సవం నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే, గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దయచేసి వదంతులను నమ్మొద్దని సూచించారు.

March 14, 2026 / 12:07 PM IST

రైతులకు ఉచితంగా టార్ఫలిన్లు పంపిణీ

W.G: తానా సంస్థ ఆద్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా తణుకులో శనివారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఉచిత టార్పాలిన్‌లు, స్ప్రేయర్లను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అందజేశారు. అలాగే రైతుల కోసం తానా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.

March 14, 2026 / 12:07 PM IST