SKLM: మెలియాపుట్టి మండలంలో ఆదివాసి ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొని ఆదివాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల సంక్షేమం తనకు ముఖ్యమని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం మెలియాపుట్టిలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలని ఆదివాసులు ఎమ్మెల్యేను కోరారు.
HYD: బీజేపీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలో వచ్చిన ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 6 గ్యారెంటీల అమలు డిమాండ్‌తో బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరుగా వెళ్లగా ఉద్రిక్తత ఏర్పడింది. రాంచందర్ రావుతో పాటు ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ELR: చింతలపూడిలోని రామకృష్ణ నగర్ ప్రధాన రహదారి ఆదివారం కురిసిన వర్షానికి చెరువును తలపిస్తోంది. గతంలో సీసీ రోడ్డు నిర్మించినా, ఇరువైపులా డ్రైనేజీలు లేకపోవడంతో నీరు వెళ్లే దారి లేక మడుగులా తయారైందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్‌గా వినియోగించడానికి వీలు లేదని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా నిబంధనలను అతిక్రమించిన ఎడల వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు. అలాంటి వారిని గుర్తించి 25 మందిపై కేసులు నమోదు, 50 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేయడం జరిగిందన్నారు.
AP: కేంద్రంపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా కనుసన్నుల్లో నడుస్తోందని అన్నారు. భారత్‌ను అమెరికా అవమానిస్తున్నా ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇరాన్‌పై దాడులు జరుగుతున్నా కేంద్రం మౌనంగా ఉండటం సరికాదన్నారు.
KDP: రాజుపాలెం తహసీల్దార్ హరినాథ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జిల్లాలో పలువురు తహసీల్దార్లను కలెక్టర్ బదిలీ చేశారు. ఇందులో భాగంగా హరినాథ్ రెడ్డి రాజుపాలెం వచ్చారు. డిప్యూటీ తహశీల్దార్ మనోహర్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి, వీఆర్వోలతో ఆయన సమావేశం అయ్యారు. మండలంలోని పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం MLA వరదరాజుల రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
KMM: మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25, 26 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ఇవాళ పేర్కొంది. ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలో శీతల వాతావరణం కొనసాగుతోంది. సోమ, మంగళవారాల్లో సాధారణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎ.రాములు మాట్లాడుతూ.. వీరుల ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
KMM: మధిర మండలం ఆత్కూరులోని అగ్నిప్రమాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్‌ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.
KKD: యూ. కొత్తపల్లి మండలం గోర్స సీతారామస్వామి ఆలయ భూముల వివాదం సోమవారం ముగిసింది. కొమరగిరిలోని 19.95 ఎకరాల భూములపై నెలకొన్న సుదీర్ఘ వివాదంపై స్పందించిన దేవాదాయశాఖ బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలం ద్వారా రూ. 10 లక్షలకు పైగా ఆదాయం లభించింది. ఈ కార్యక్రమంలో ఈవో ధనలక్ష్మి, ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ: శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం బీసీల పట్ల సీఎం చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఇవాళ అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్ద వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
KRNL: ఆదోని మండలం సాదాపురంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఆదోని టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు ఇవాళ పాల్గొని రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పంచసూత్రాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల ప్రయోజనాలను వివరించారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో అంబటి వెంకటేశ్వర్లు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యల నిమిత్తం నిత్యం తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారని తెలిపారు. ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని వారి దాహాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు.
కడప: మండల నూతన తహసీల్దార్‌గా మహబూబ్ చాన్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సుండుపల్లి, రాజంపేట మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేసిన ఆమెకు పరిపాలనలో మంచి అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఉన్న రెవిన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో జరిగిన 84వ రోజు కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొని వినతిపత్రాలు సమర్పించారు. ఆంధ్రా యూనివర్సిటీ మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులు వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని కోరారు. జాబ్ కేలండర్‌లో విద్యుత్ శాఖ ఏఈఈ, జెఎల్ఎం పోస్టులు చేర్చాలని అభ్యర్థులు విన్నవించారు.