SDPT: మాత శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాల సంఖ్యను పెంచుతూ గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గజ్వేల్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. గర్భిణులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
WNP: జిల్లాలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు ఆస్కారం లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి ప్రభుత్వ బాలల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణపై అధికారులను కీలక సూచనలు చేశారు. కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారి ఉన్నారు.
AP: రాజధానిపై వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ప్రపంచంలోనే మంచి అసెంబ్లీ భవనం ఏపీలో ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని ఎలా కడతారని వైసీపీ భ్రమలో ఉందని ఎద్దేవా చేశారు. రాజధాని కోసం చేసిన అప్పులు.. భూమి అమ్మకాల ద్వారా తీరుస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళిక లేదని ఆరోపించారు.
కోనసీమ: అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్ద వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో శెట్టిబలిజ పితామహులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చింత అనురాధ, ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు పాల్గొని వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
PPM: పశువులకు గాలికుంట టీకాలు తప్పనిసరిగా వేయించాలని మామిడిపల్లి పశు వైద్య అధికారి ప్రభాకర్ తెలిపారు. సోమవారం మద్దెనవలస గ్రామంలో నిర్వహించిన టీకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఈ టీకాలు పశువులకు వేయించడం వలన పాలు ఉత్పత్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పీజీ వైద్య సీట్ల వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో పీజీ వైద్య సీట్ల భర్తీ కౌన్సిలింగ్ పొడిగించే వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై ఆలోచించి నిర్ణయం చెప్పాలని జాతీయ మెడికల్ కమిషన్‌ని కోర్టు ఆదేశించింది. కాగా, పీజీ వైద్య కాలేజీల్లో కొన్ని సీట్లు మిగిలిపోయిన విషయం తెలిసిందే.
ASF: కాగజ్ నగర్ మండలం వేంపల్లి టింబర్ డిపోలో ఈనెల 24న ఉదయం 11 గంటలకు కలప వేలం నిర్వహించనున్నట్లు జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫారెస్ట్ డివిజనల్ అధికారి A. అప్పయ్య పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో, నిబంధనల ప్రకారం పారదర్శకంగా కలపను విక్రయిస్తారన్నారు. అర్హత కలిగిన వ్యాపారులు, వినియోగదారులు పాల్గొని షరతులు పాటించాలని పేర్కొన్నారు.
SRCL: కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తాడూరు సర్పంచ్ రెడ్డి మల్ల సదానందం అన్నారు. తంగళ్ళపల్లి మండలం తాడూరులో మహిళా భవనానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వర్గానికి లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్నారు.
ADB: రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని MLA అనిల్ జాదవ్ సోమవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు రోడ్డు మార్గాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు తక్షణమే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి నిధులను మంజూరు చేయాలని E&Cకి ఆదేశాలు జారీ చేశారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలోని మహమ్మద్ ఖాసింబస్తీ 30, 31 వార్డులలో UHC ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సుచిత్ర కాలనీవాసులకు ఆరోగ్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కౌన్సిలర్లు సుకేసిని, స్రవంతి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి వైద్యం అందించడం సంతోషకరమన్నారు. ఈ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
KRNL: మంత్రాలయం (M) సుంకేశ్వరి గ్రామంలో ఇవాళ “రైతన్న మీకోసం వారోత్సవాల్లో” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TDP ఇన్‌ఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాజారెడ్డి పాల్గొన్నారు. ఇవాళ వారు రైతులతో సమావేశమై పంచసూత్రాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు భూమిపూజ చేశారు.
E.G: దేశ స్వాతంత్య్ర సాధన కోసం చిన్న వయసులోనే ప్రాణాలను అర్పించి, ధైర్యంతో పోరాడిన విప్లవ వీరులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆ మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ.. ఈ షహీద్ దివస్ సందర్భంగా నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.
TG: గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ కోల్పోతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అపార్ట్‌మెంట్ భవిష్యత్తులో ఎందుకూ పనికిరాదని.. దానిని ఎవరూ కొనబోరని వ్యాఖ్యానించారు. అసలు గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తాము మధురిడ్జ్ ఆపార్ట్‌మెంట్ కావాలని అడగలేదని స్పష్టం చేశారు.
VKB: కుల్కచర్ల మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. సోమవారం మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ గోదాం వద్ద వినియోగదారులు భారీగా క్యూ కట్టారు. పది రోజులుగా తిరుగుతున్నా సిలిండర్లు లభించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరమైన గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించి తమ ఇబ్బందులు తొలగించాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.
KMM: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ రామ్మూర్తి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై ఇవాళ జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ వంటి హామీలు ఇప్పటివరకు అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు.