• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

GOOD NEWS: భారీ జీతంతో ఉద్యోగాలు

ఏపీ హైకోర్టులో వివిధ విభాగాల్లో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 19 వరకు అధికారిక వెబ్‌సైట్ aphc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.80 వేల వరకు జీతం ఉంటుంది.

March 23, 2026 / 05:07 PM IST

పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

SKLM: అంబేద్కర్ యూనివర్సిటీ పీజీ ఆర్ట్స్ & సైన్స్ కోర్సులకు సంబంధించి 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారిని డాక్టర్ యు. కావ్యజోష్ణ విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800, ప్రాక్టికల్ ఫీజు రూ.250లతో కలిపి మొత్తం రూ.1,050 చెల్లించాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి సకాలంలో ఫీజును చెల్లించాలని కోరారు.

March 23, 2026 / 05:06 PM IST

అమర జవానుకు ఘన నివాళి

NLG: దేశ రక్షణతో పాటు సామాజికాభివృద్ధికి కృషి చేసిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ సేవలు వెలకట్టలేనివని చందంపల్లి సర్పంచ్ చంద్రకళ కొనియాడారు. చందంపల్లి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రమాదవశాత్తు మరణించిన జనార్ధన్ ఆశయాలను యువత కొనసాగించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.

March 23, 2026 / 05:06 PM IST

గంజాయి అక్రమ రవాణాపై రైల్వే పోలీసుల ఉక్కు పాదం

HYD: సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, ఈగల్ బృందం, రైల్వే రక్షణ దళం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులు దీపక్ సాహు(26), దీపక్ గౌడ(20)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10.089 కిలోల గంజాయి (విలువ రూ.5,04,450)తో పాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాయిశ్వర గౌడ్, మాధవ్ పాల్గొన్నారు.

March 23, 2026 / 05:06 PM IST

నిత్య అన్నదాన సత్రాన్ని పరిశీలించిన JEO

KDP: ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయం వద్ద టీటీడీ అధికారులు భక్తులకు మూడు పూటలా నిత్య అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం నేరుగా అన్నదాన సత్రానికి వెళ్లి భక్తులతో మాట్లాడారు. ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, అధికారులు పాల్గొన్నారు.

March 23, 2026 / 05:05 PM IST

‘సమ్మక్క కుటుంబానికి న్యాయం చేయాలి’

ASF: పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో హత్యకు గురైన సమ్మక్క కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.

March 23, 2026 / 05:05 PM IST

‘జగన్ వారికి సమాన హక్కులు ఎందుకు ఇవ్వలేదు’

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ & బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన విజయమ్మ లేఖపై స్పందిస్తూ.. మహిళల ఆస్తి హక్కులు వ్యక్తిగత కుటుంబ సమస్య కాదని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ తన తల్లి, చెల్లికి సమాన హక్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మహిళలు తమ హక్కుల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

March 23, 2026 / 05:04 PM IST

‘కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలి’

కోనసీమ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార జాతుల వారికి కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం అమలాపురం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

March 23, 2026 / 05:04 PM IST

రైతు భరోసా నిధులపై బ్యాంకర్ల అడ్డంకులు

WGL: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ వరంగల్ జిల్లాలో బ్యాంకర్‌లు క్రాప్ లోన్ల రీన్యువల్ చేయలేదని రైతుల ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నారని రైతులు ఆరోపించారు. ఇప్పటికే వర్షాల వల్ల నష్టపోయిన రైతులు తీవ్రంగా నష్టపోయి ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ స్పందించి రైతు భరోసా బ్యాంకుల నుంచి డబ్బులు ఇప్పిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

March 23, 2026 / 05:04 PM IST

శాంసంగ్‌ టు ఐఫోన్‌.. ఫైల్‌ షేర్ చేస్తున్నారా..?

శాంసంగ్‌ ఫోన్ల నుంచి ఐఫోన్లకు వీడియోలు, ఫొటోలు నేరుగా షేర్ చేయలేకపోతున్నారా..? ఈ సమస్యకు చెక్‌ పెట్టెందుకు శాంసంగ్‌ సిద్ధమైంది. తన S26 సిరీస్‌లో యాపిల్‌ ఫోన్ల తరహా ఎయిర్‌డ్రాప్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఫోటోలను, వీడియోలను ఐఫోన్లకు సులువుగా షేర్‌ చేయొచ్చు.

March 23, 2026 / 05:03 PM IST

‘ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేస్తాం’

MNCL: లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని మండల ప్రత్యేక అధికారి డాక్టర్ అవినాష్ అన్నారు. సోమవారం మండలంలోని అంకత్పల్లి, పోతపల్లి గ్రామాలలో స్థానిక ఎంపీడీవో సరోజ, ఎంపీడీవో శ్రీనివాస్ లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

March 23, 2026 / 05:02 PM IST

‘ధురంధర్‌’ పార్ట్ 3 వస్తుందా..?

‘ధురంధర్‌ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ‘ధురంధర్‌ 3’ వస్తుందనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే దర్శకుడు ఆదిత్యధర్ సన్నిహిత వర్గాలు వీటిని ఖండించాయి. రెండు భాగాలుగా 8 గంటల నిడివితో కథను ఇప్పటికే పూర్తి చేశామని, ఇక సాగదీసే ఉద్దేశం లేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఆదిత్యధర్ తన తదుపరి కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు తెలిపాయి.

March 23, 2026 / 05:02 PM IST

పోలీస్ ప్రజావాణిలో 16 మంది ఫిర్యాదు

SRD: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 16 మంది తమ సమస్యలను ఎస్పీ పరితోష్ పంకజ్‌కు విన్నవించారు. ఫిర్యాదులను ఓపికగా విన్న ఎస్పీ, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని మరియు విచారణ పారదర్శకంగా జరిపించాలని సంబంధిత ఎస్సైలను ఆదేశించారు.

March 23, 2026 / 05:02 PM IST

ఆర్డీవోగా ఆర్.శివ రాముడు బాధ్యతలు

E.G: నూతనంగా రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌గా ఆర్.శివ రాముడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జేసీ వై.మేఘా స్వరూప్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జేసీకు పూల మొక్కను అందజేశారు. జేసీ ఆర్.శివ రాముడిని అభినందించి ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేయాలని సూచించారు.

March 23, 2026 / 05:02 PM IST

‘ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి’

SDPT: గజ్వేల్ మున్సిపాలిటీలో జరిగే ప్రభుత్వ కార్య క్రమాల్లో తమకు భాగస్వామ్యం కల్పించడం లేదని ఛైర్ పర్సన్ గంగిశెట్టి చందన, వైస్ ఛైర్మన్ పద్మాబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అధికార దాహంతో ప్రోటోకాల్‌ను గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇవాళ ఆర్డీవో చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం తమను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించాలన్నారు.

March 23, 2026 / 05:02 PM IST