ఏపీ హైకోర్టులో వివిధ విభాగాల్లో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 19 వరకు అధికారిక వెబ్సైట్ aphc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.80 వేల వరకు జీతం ఉంటుంది.