‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ‘ధురంధర్ 3’ వస్తుందనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే దర్శకుడు ఆదిత్యధర్ సన్నిహిత వర్గాలు వీటిని ఖండించాయి. రెండు భాగాలుగా 8 గంటల నిడివితో కథను ఇప్పటికే పూర్తి చేశామని, ఇక సాగదీసే ఉద్దేశం లేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఆదిత్యధర్ తన తదుపరి కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు తెలిపాయి.