• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భగత్ సింగ్ వర్థంతి సభ పోస్టర్ల ఆవిష్కరణ

BHGN: దేశ స్వతంత్ర పోరాటంలో పోరాడి తమ ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్‌ల 95 వ వర్ధంతి సభలను పోస్టర్‌ను ఆలేరు గ్రామంలో ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలో మార్చి 23 నుంచి 30 వరకు జరపాలని పిడిఎస్‌యూ జిల్లా అధ్యక్షులు ఆర్.ఉదయ్, పివై ఎల్ జిల్లా సహాయ కార్యదర్శి ఎలగందుల సిద్ధులు పిలుపునిచ్చారు. 

March 23, 2026 / 04:00 PM IST

మణికట్టు నొప్పి తగ్గించే చిట్కాలు

మౌస్, కీబోర్డ్ ఎక్కువగా వాడేవారికి మణికట్టు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మధ్య మధ్యలో చేతులను సాగదీయడం, మణికట్టును గుండ్రంగా తిప్పడం వంటివి చేయాలి. ఒక చేతిని చాచి, అరచేతిని పైకి ఉంచి వేళ్లను వెనక్కి లాగాలి. ఇలాగే అరచేతిని కిందికి ఉంచి చేయాలి. పిడికిలిని 5 సెకన్లు బిగించి, ఆపై వేళ్లను వెడల్పుగా తెరవాలి. ఇలా చేయడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

March 23, 2026 / 04:00 PM IST

మద్యం వ్యాపారానికి అనుమతివ్వండి: మల్లారెడ్డి

TG: అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావును మాజీ మంత్రి మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లారెడ్డి ఇటీవల ప్రారంభించిన ఫ్లైట్ రెస్టారెంట్‌లో మద్యం విక్రయాలకు సంబంధించి బార్ లైసెన్స్ మంజూరు చేయాలని మంత్రి జూపల్లిని కోరారు. మల్లారెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన జూపల్లి.. ఎలైట్ బార్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 23, 2026 / 03:57 PM IST

మస్కట్‌లో కన్నుల పండుగగా వేములవాడ రాజన్న కళ్యాణం

SRCL: గల్ఫ్ దేశమైన ఒమన్ రాజధాని మస్కట్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఒమన్ తెలంగాణ సమితి(ఓటీఎస్) ఆధ్వర్యంలో నగరంలోని శ్రీకృష్ణ మందిర ప్రాంగణంలో ఆదివారం శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఒమన్‌లో భారత రాయబారి జీవి శ్రీనివాస్, నిర్వాహకులు నూనె లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

March 23, 2026 / 03:57 PM IST

నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు

NLR: ఇందుకూరుపేట(మం) గంగపట్నం పల్లిపాలెంలో బ్రిడ్జి లేక ప్రజలు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలె ఓ మృతదేహాన్ని నడుము లోతు నీటిలో, బురద మార్గంలో థర్మాకోల్ షీట్‌పై తరలించాల్సి వచ్చింది. బ్రిడ్జి లేక జీవితం నరకంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.

March 23, 2026 / 03:55 PM IST

MPDO ఆఫీస్ ఎదుట ఆందోళన

SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామ వాటర్ మెన్ బాలయ్య తన కుటుంబంతో కలిసి సోమవారం MPDO ఆఫీసు ముట్టడించారు. గత 4 నెలల నుంచి జీతం ఇవ్వడం లేదని, తమ పట్ల సర్పంచ్ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక పస్తులతో ఉన్నామన్నారు. వేతనం ఇవ్వకపోతే ఇక్కడే పురుగుల మందులు తాగి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. బాలయ్యకు వేతనం అందించే చర్యలు తీసుకుంటామని MPO తెలిపారు.

March 23, 2026 / 03:53 PM IST

ఈనెల 26న జాబ్ మేళా.. ఎక్కడంటే?

ఏలూరు జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేష్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత పొందిన 18-35 వయసు కలిగిన యువత అర్హులు అన్నారు. మరిన్ని వివరాలకు https://employment.ap.gov.in వెబ్ సైట్‌లో సంప్రదించాలన్నారు.

March 23, 2026 / 03:51 PM IST

మైక్రో ఫైనాన్స్ మోసాలపై మంగ్లీ క్లారిటీ

తన పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జరుగుతోందని వస్తున్న వార్తలపై ఫోక్ సింగర్ మంగ్లీ స్పందించింది. తనకు ఎలాంటి ఫైనాన్స్ సంస్థలతో సంబంధం లేదని, తన పేరు వాడుకుని డబ్బులు వసూలు చేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఈవెంట్స్ కోసం వచ్చే వారి వ్యక్తిగత వ్యాపారాలకు తాను బాధ్యురాలిని కానని, ఇది తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

March 23, 2026 / 03:50 PM IST

అక్రమ అరెస్టులతో అడ్డుకోలేరు: కిషన్ రెడ్డి

TG: బీజేపీ తలపెట్టిన ఛలో అసెంబ్లీని అడ్డుకోవడం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అక్రమ అరెస్టులతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని.. రాంచందర్ రావు సహా బీజేపీ సీనియర్లను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అభద్రతాభావానికి అద్దంపడుతోందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా..? లేక పోలీస్ బలగాలతో పాలిస్తున్నారా? అని ప్రశ్నించారు.

March 23, 2026 / 03:50 PM IST

‘డ్రైవర్లపై చర్యలు తీసుకోండి’

GDWL: జిల్లాలో RTC బస్సులు నడిపే డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బలిగేరా మోజెస్ తెలిపారు. సోమవారం గద్వాల కలెక్టరేట్‌లోని ప్రజావాణి కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

March 23, 2026 / 03:50 PM IST

ఉత్తమ అటవీ అధికారిగా నజీర్ ఖాన్

NRML: అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖలో విశిష్ట సేవలు అందించిన అటవీ అధికారి మహ్మద్ నజీర్ ఖాన్‌కు ప్రశంసాపత్రం అందజేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సన్మానం చేశారు. అటవీ, వన్యప్రాణి సంరక్షణ, చట్టాల అమలు, చైనా మాంజా నిషేధం వంటి అవగాహన కార్యక్రమాలలో చేసిన కృషికి ఈ అవార్డును వారికి అందజేశారు.

March 23, 2026 / 03:48 PM IST

‘ఎన్నికల హామీలను నెరవేర్చాలి’

ADB: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భీంపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు అంకం అశోక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపులో భాగంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంతవరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

March 23, 2026 / 03:47 PM IST

విదేశీ క్రికెటర్లకు ఉగ్ర హెచ్చరికలు..!

పాకిస్తాన్ సూపర్ లీగ్-2026 ప్రారంభానికి ముందే తీవ్ర భద్రతా ఆందోళనలు నెలకొన్నాయి. పాకిస్తాన్‌కు చెందిన జమాత్-ఉల్-అహ్రార్ అనే మిలిటెంట్ గ్రూప్ విదేశీ ఆటగాళ్లకు బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. PSLలో పాల్గొనేందుకు పాక్‌కు రావద్దని, వస్తే వారి భద్రతకు తాము బాధ్యత వహించబోమని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది. వెంటనే లీగ్ నుంచి తప్పుకోవాలని ఆ గ్రూప్ డిమాండ్ చేసింది.

March 23, 2026 / 03:46 PM IST

కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడిన సంగమేశ్వరాలయంం

NDL: నందికొట్కూరు సమీపంలోని ముచుమర్రి వద్ద ఉన్న ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం కృష్ణానది నీటిమట్టం తగ్గడంతో మళ్లీ బయటపడింది. గత కొన్ని నెలలుగా శ్రీశైలం జలాశయం నీటితో మునిగిపోయిన ఈ ఆలయం, నీరు తగ్గడంతో భక్తులకు దర్శనమిస్తోంది. 7 నదులు సంగమించే పవిత్ర స్థలంలో ఉన్న ఈ ఆలయం ప్రతి సంవత్సరం నీటిలో మునిగి, తిరిగి బయటపడటం విశేషం.

March 23, 2026 / 03:45 PM IST

‘భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలి’

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే సామర్థ్యం ఉన్న సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన 11 వేల కోట్ల రూపాయల నిధుల్లో 2026-27 ఆర్థిక బడ్జెట్‌లో కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ అన్నారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం కామేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో భూ నిర్వాసితులకు పరిహారం అందించాలన్నారు.

March 23, 2026 / 03:44 PM IST