SRCL: గల్ఫ్ దేశమైన ఒమన్ రాజధాని మస్కట్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఒమన్ తెలంగాణ సమితి(ఓటీఎస్) ఆధ్వర్యంలో నగరంలోని శ్రీకృష్ణ మందిర ప్రాంగణంలో ఆదివారం శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఒమన్‌లో భారత రాయబారి జీవి శ్రీనివాస్, నిర్వాహకులు నూనె లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.