ఏలూరు జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేష్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత పొందిన 18-35 వయసు కలిగిన యువత అర్హులు అన్నారు. మరిన్ని వివరాలకు https://employment.ap.gov.in వెబ్ సైట్లో సంప్రదించాలన్నారు.