TPT: గ్యాస్ కష్టాలు అదునుగా చేసుకుని తిరుపతిలో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఆహార వ్యాపారులు ధరలు పెంచి ఇష్టానుసారం అమ్మకాలు సాగిస్తున్నారు. టీ, కాఫీ, పాలు రూ.10-12 ఉండగా.. ప్రస్తుతం రూ.20 నుంచి రూ.26 వరకు, టిఫిన్లు, భోజనం, ఫాస్ట్ ఫుడ్స్ గతంలో ఉన్నదానికంటే రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. దీంతో నిత్యావసర వస్తువులకు, ఆహార పదార్థాల ధరలకు రెక్కలు వచ్చాయ అన్నట్లు అనిపిస్తోంది.