TG: HYDలో కాలుష్య రహిత రవాణా దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం కింద నగరానికి 915 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. వీటిలో కాలనీల కోసం 100 మినీ బస్సులు, ప్రధాన రూట్ల కోసం 815 స్టాండర్డ్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఈకేఏ మొబిలిటీ సంస్థ వీటిని సరఫరా చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల నగరంలో కాలుష్యం తగ్గుతుంది.