SRPT: హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఇవ్వాళ జరిగిన కౌన్సిల్ సమావేశంలో పట్టణ మొదటి బడ్జెట్ను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ అభివృద్ధికి సహకరించిన పాలకవర్గానికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.