KRNL: ఆదోని పట్టణంలో మహిళా మరుగుదొడ్ల నిర్మాణంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇవాళ బీజేపీ నాయకులు మండిపడ్డారు. రెండేళ్ల క్రితమే నిధులు, ప్రణాళికలు సిద్ధమైనా పనులు ప్రారంభించకపోవడంపై వినీత గుప్తా, తోవి నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆరోగ్యం దృష్ట్యా తక్షణమే నిర్మాణాలు చేపట్టాలని కోరారు.