• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అద్దంకి నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ

ప్రకాశం: అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీతో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ కార్యకలాపాలు వేగం అందుకున్నాయి.

March 25, 2026 / 05:10 PM IST

ట్యాంకర్‌ను ఢీకొట్టిన బైక్‌.. వ్యక్తికి గాయాలు

NLR: కందుకూరు మండలం కొండ ముడుసుపాలెం సమీప జాతీయ రహదారిపై బైక్ పెట్రోలియం ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 05:10 PM IST

BLOలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

WGL: నల్లబెల్లి మండలంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఇవాళ బూత్ లెవల్ అధికారులకు తహసీల్దార్ ముప్పు కృష్ణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఓటరు జాబితా సవరణలు, నమోదు ప్రక్రియలో ఖచ్చితత్వం పాటించడం, తప్పుల సరిదిద్దడం వంటి అంశాలపై BLOలకు స్పష్టమైన సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తహసీల్దార్ తెలిపారు.

March 25, 2026 / 05:08 PM IST

బసాపురంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం

KRNL: ఆదోని మండలం బసాపురం గ్రామంలో బుధవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు హాజరయ్యారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధిని రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయం, సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలపై అవగాహన కల్పించారు. రైతు సంక్షేమమే లక్ష్యమని నాయకులు తెలిపారు.

March 25, 2026 / 05:08 PM IST

జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ తనిఖీలు

MBNR: జిల్లా కేంద్రంలోని పలు వాణిజ్య సంస్థలలో బుధవారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాణిజ్య సంస్థలలో అక్రమంగా వినియోగిస్తున్న 11 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఎనిమిది కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

March 25, 2026 / 05:05 PM IST

పెండింగ్ బిల్లుల కోసం వర్కర్ల ఆవేదన

BDK: అశ్వాపురం మండలంలో మిషన్ భగీరథ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ నిరసన చేపట్టారు. మనబోతులపాడు, ఎలకలగూడెం, గొల్లగూడెం గ్రామాల్లో పనులు పూర్తి చేసినప్పటికీ చెల్లింపులు నిలిచిపోయాయని వాపోయారు. అధికారులు తప్పించుకుంటున్నారని, బకాయిల కోసం ఆస్తులు అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

March 25, 2026 / 05:05 PM IST

హెల్త్ క్లినిక్ పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ

PLD: పిడుగురాళ్ల మండల పరిధిలోని కామేపల్లి గ్రామంలో హెల్త్ క్లినిక్ సెంటర్‌ను మెడికల్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సౌరబ్ గౌర్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో హెల్త్ క్లినిక్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందిస్తారు అన్నారు.

March 25, 2026 / 05:04 PM IST

మార్కెట్‌లో ధరల వివరాలివే!

NGKL: అచ్చంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు ఇవాళ వేరుశనగ పంట భారీగా తరలివచ్చింది. బుధవారం 742.75 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్ఠ ధర రూ.8,036, మోడల్ ధర రూ.7,009గా నమోదైంది. కనిష్ఠ ధర రూ.5,229 పలికింది. అలాగే మొక్కజొన్న గరిష్ఠ ధర రూ. 1,811గా నమోదైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

March 25, 2026 / 05:01 PM IST

28న మున్సిపాలిటీలో వేలం పాటలు: కమిషనర్

GNTR: పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన వివిధ మార్కెట్ల వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు బుధవారం తెలిపారు. కూరగాయల మార్కెట్, సండ్రీ మార్కెట్, మాంసము మార్కెట్, చేపల మార్కెట్, జంతు వధశాలలకు వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.

March 25, 2026 / 05:00 PM IST

ఆయనే నాకు ఆదర్శం: మాజీ ఎమ్మెల్యే

CTR: ఇటీవల మృతి చెందిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే టి.సి.రాజన్ (104) చిత్రపటానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజకీయాలంటే కేవలం సేవే గాని సంపాదన కాదని.. నీతి, నిజాయితీలే ఆభరణాలుగా తన శేషజీవితాన్ని నిరాడంబరంగా గడిపిన రాజన్ తనకు ఆదర్శమని ఆయన తెలిపారు.

March 25, 2026 / 05:00 PM IST

నాగలాపురం ఎంపీడీవోగా శ్రీతేజస్విని బాధ్యతలు

TPT: నాగలాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణిగా మూడి శ్రీతేజస్విని బధవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 ద్వారా ఎంపికై నాగలాపురం మండలంలో మొదటిసారిగా ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

March 25, 2026 / 05:00 PM IST

ఆర్డీటీ రెన్యూవల్ క్రెడిట్ మంత్రి లోకే‌శ్‌దే: ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషితోనే ఆర్డీటీ ఎఫ్‌సి‌ఆర్‌ఏ లైసెన్స్ పునరుద్ధరణ సాధ్యమైందని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ సంస్థను నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు క్రెడిట్ కోసం జగన్ ట్వీట్ చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు.

March 25, 2026 / 05:00 PM IST

‘పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి’

VZM: జనాభా లెక్కల కార్యక్రమంపై పూర్తి అవగాహనతో పని చేయాలని కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో గృహాల లెక్కింపు, రెండవ దశలో వచ్చే ఏడాది జనాభా గణన జరుగుతుందని తెలిపారు.

March 25, 2026 / 05:00 PM IST

ధూళపాళ్ల కుమార్తె వివాహంలో సీఎంల సందడి

AP: గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబుతో పాటు TG సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. వారితో పాటు Dy.CM పవన్‌కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, సంధ్యారాణి, సవిత, పలువురు ఎమ్మెల్యేలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

March 25, 2026 / 04:58 PM IST

కంభంలోని గ్యాస్ గోడౌన్లలో తనిఖీలు

ప్రకాశం: కంభంలోని గ్యాస్ గోడౌన్లలో బుధవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా నిబంధనలు, అగ్నిమాపక సదుపాయాలు, సిలిండర్ల నిల్వ, రవాణా విధానాలను పరిశీలించారు. గోడౌన్ యజమానులు అన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని సీఐ మల్లికార్జున హెచ్చరించారు. గ్యాస్ కొరతను సృష్టిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 25, 2026 / 04:58 PM IST