ప్రకాశం: అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీతో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ కార్యకలాపాలు వేగం అందుకున్నాయి.