• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు’

MHBD: యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తొర్రూరు ఎస్సై ఉపేందర్ సూచించారు. ఇవాళ తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో గంజాయి నిర్మూలన, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

March 23, 2026 / 04:35 PM IST

రాష్ట్రానికి బీసీ సీఎం అవుతారు: TPCC

TG: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీసీ సీఎం అవుతారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. బీసీని సీఎం చేస్తామని చెప్పే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ బీసీని సీఎం చేస్తామని చెప్పగలరా? అని నిలదీశారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటోందన్నారు.

March 23, 2026 / 04:34 PM IST

BREAKING: రాష్ట్రానికి రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడి

AP: అనకాపల్లి జిల్లాలో భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రూ.1.36 లక్షల కోట్లతో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ప్రారంభంకానుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు పనుల కోసం రెండు దశల్లో 5,465 ఎకరాల్లో భూమి సేకరించనున్నారు. తొలిదశలో 2164 ఎకరాల భూమి కేటాయింపు జరగనుంది.

March 23, 2026 / 04:34 PM IST

‘ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత’

ELR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇవాళ జిల్లా SP ప్రతాప్ శివ కిషోర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా కార్యాలయం వరకు వచ్చి సమయం, డబ్బు వృథా చేసుకోకుండా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు.

March 23, 2026 / 04:34 PM IST

నూతన ఎస్సైను కలిసిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

RR: చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన కే.గిరిని ఏఎంసీ ఛైర్మన్ గీత సింగ్, డైరెక్టర్స్ కందాడ నరసింహారెడ్డి, చిట్టెపు రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని,అందుకు అందరూ సహకరించాలని కోరారు.

March 23, 2026 / 04:34 PM IST

ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం

KRNL: పుటకలమర్రి AP మోడల్ స్కూల్, jr. కాలేజీలో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ షమీలా తెలిపారు. MPC, BiPC, MEC, CEC గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. OC/0BCలకు రూ.200, SC/STలకు రూ.150 దరఖాస్తు రుసుముగా నిర్ణయించామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు APR 30వ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 23, 2026 / 04:34 PM IST

ఆస్తిపన్ను చెల్లించే వారికి శుభవార్త..!

VSP: జీవీఎంసీ పరిధిలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులకు కమిషనర్ కేతన్ గార్గ్ తీపి కబురు చెప్పారు. మార్చి 31లోగా బకాయిలు చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ వస్తుందని ప్రకటించారు. ఇంటి పన్ను, ఖాళీ జాగా పన్ను బకాయిలపై ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు. సెలవు రోజుల్లో కూడా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.

March 23, 2026 / 04:31 PM IST

నివాళులు అర్పించిన ఎస్పీ

CTR: ప్రముఖ సంఘసంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ ఘన నివాళులు అర్పించారు. వెనుక పడిన వర్గాల అభ్యున్నతికి, విద్యా ప్రాచుర్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. విదేశీ విద్యకు వ్యతిరేకంగా తన ఆస్తులను సైతం దానం ఇచ్చారని కొనియాడారు.

March 23, 2026 / 04:31 PM IST

జనగామలో నిరసన చేపట్టిన TRP నేతలు

జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు నిరసన చేపట్టారు. TRP జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు కూడా చేయకపోవడం దురదృష్టకరమని, బడ్జెట్‌లో బీసీలకు మొండిచేయి చూపించారని విమర్శించారు.

March 23, 2026 / 04:31 PM IST

‘ధర్మారంలో పదో తరగతి పరీక్ష ప్రశాంతం’

PDPL: ధర్మారం మండలంలో ఇవాళ నిర్వహించిన పదవ తరగతి ఆంగ్లం పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఎంఈవో ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. 710 మంది విద్యార్థులకు మొత్తం మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. 100% హాజరు నమోదు అయిందన్నారు.

March 23, 2026 / 04:30 PM IST

‘ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

BHNG: ప్రజావణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 52 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

March 23, 2026 / 04:30 PM IST

మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభించిన చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కుమారస్వామితో పాటు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ భారీ పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

March 23, 2026 / 04:28 PM IST

‘జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి’

E.G: తాళ్లపూడిలో కరిబండి సుబ్బారావు మెమోరియల్ డిగ్రీ కాలేజీలో సోమవారం జరిగిన జాబ్ మేళాలో కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 23, 2026 / 04:28 PM IST

ఓటీటీలోకి ‘హే బల్వంత్’.. ఎప్పుడంటే?

టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చెర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకోగా.. మార్చి 31 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తన తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా  తీసుకోవాలనుకునే యువకుడి కథతో ఈ సినిమా రూపొందింది.

March 23, 2026 / 04:26 PM IST

‘రైతులకు ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి’

NTR : అకాల వర్షాలతో దెబ్బతిన్న నందిగామ మండలం రామిరెడ్డిపల్లి పంట పొలాలను YCP ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాల్ మొక్కజొన్నను రూ.2400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

March 23, 2026 / 04:26 PM IST