సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘రాకాస’. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్‌ను పొందింది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది.
KKD: కాకినాడ జిల్లాలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని JC అపూర్వ భరత్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. నిల్వలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 8886903611కు ఫిర్యాదు చేయాలని సూచించారు. భాగ్యనగర్ గ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్లను మరింత పెంచుతామన్నారు.
ELR: జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్ నిల్వలకు ఎటువంటి కొరతా లేదని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. గురువారం గ్యాస్, పెట్రోల్ సరఫరాపై అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో నిత్యాన్నదానం నిర్వహించే దేవాలయాలు, సంక్షేమ వసతి గృహాలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలన్నారు.
KMM: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, మెప్మా సమన్వయంతో (PM SVANidhi) లబ్ధిదారులైన వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్ సాయి పాల్గొని మాట్లాడుతూ.. వ్యాపార లాభాల్లో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడంలోని ప్రాముఖ్యత డిజిటల్ లావాదేవీలుపై అవగాహన కల్పించారు.
MDK: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్ద శంకరంపేట తహసీల్దార్ ప్రభుదాస్, ఎస్సై ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేయడం, కేసు కూడా నమోదు చేస్తామన్నారు.
సత్యసాయి: జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు 5000 లీటర్ల సామర్థ్యం గల స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంకర్ల కొనుగోలుకు జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల సరఫరాదారులు తమ కొటేషన్లను సీలు చేసిన కవరులో మార్చి 30 లోపు పుట్టపర్తిలోని కార్యాలయంలో అందజేయాలని సూచించింది.
TG: సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిర్మల్ వాసి మృతి చెందారు. సౌదీ అరేబియా ఓమ్ లోజ్ మదీనా ప్రాంతంలో వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ కు చెందిన మహమ్మద్ జావిద్(42) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
అప్పటివరకు సంతోషంగా, చురుగ్గా ఉండే కొందరు పిల్లలు కాలేజీకి వెళ్లగానే సైలెంట్ అయిపోతారు. ఇలాంటి మార్పులను వెంటనే గుర్తించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు కాలేజీలో వేధింపులకు గురవుతున్నారేమో పరిశీలించాలి. ఫ్రెండ్లీగా మాట్లాడి వారి భయాలను తెలుసుకోవాలి. మేమున్నామనే భరోసా ఇచ్చి, ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచిస్తున్నారు.
JGL: మెట్ పల్లి మండలం పెద్దాపూర్ ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్లో పడిపోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బైక్ ను యువతి నడిపినట్టు గ్రామస్తులు చెప్తున్నారు . బైక్ పై ఉన్న యువతి, యువకుడు ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు సంఘటన స కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో గురువారం సీసీ రోడ్డు పనులను సర్పంచ్ విసంపల్లి కవిత బాలకృష్ణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందరీకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఐపీఎల్-2026 సీజన్ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్లలో తాను ఇప్పటికే భారీగా పరుగులు సాధించానని తెలిపాడు. కాబట్టి ప్రత్యేకంగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. తన ప్రదర్శనపై తనకు నమ్మకం ఉందని చెప్పాడు. జట్టు విజయం కోసమే ఆడతానని వెల్లడించాడు.
KDP: ప్రొద్దుటూరులోని స్థానిక ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన వివాహిత భర్తతో గొడవపడి గురువారం తనతో పాటు ముగ్గురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు సాయంత్రం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం పడుకునే ముందు మొబైల్ వాడటం. ప్రశాంతమైన నిద్ర కోసం ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, గదిలో చీకటిగా ఉంచుకోవడం ఉత్తమం. రాత్రి పూట కాఫీ, టీలకు దూరంగా ఉండటం ముఖ్యం. శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతపడి త్వరగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది.
ఐపీఎల్ 19వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ’19 YEAR LEGACY’ పేరుతో ఐపీఎల్ యాజమాన్యం ధోనీ, రోహిత్, కోహ్లీ, మనీష్ పాండే ఫొటోలను షేర్ చేసింది. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుండి ఇప్పటివరకు ఆడుతున్నది వీరు నలుగురు మాత్రమే కావడం విశేషం. ఈ సీనియర్ల ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, IPL ప్రారంభం నుంచి కోహ్లీ మాత్రమే ఒకే జట్టు తరఫున ఆడుతున్నాడు.
NRML: నిర్మల్ పట్టణంలోని ప్రముఖ వైద్యుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి ఆర్యవైశ్య సంఘం, బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించేంతవరకు స్టేషన్ ముందు నుండి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు.