NGKL: అచ్చంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు ఇవాళ వేరుశనగ పంట భారీగా తరలివచ్చింది. బుధవారం 742.75 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్ఠ ధర రూ.8,036, మోడల్ ధర రూ.7,009గా నమోదైంది. కనిష్ఠ ధర రూ.5,229 పలికింది. అలాగే మొక్కజొన్న గరిష్ఠ ధర రూ. 1,811గా నమోదైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.