KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే సామర్థ్యం ఉన్న సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన 11 వేల కోట్ల రూపాయల నిధుల్లో 2026-27 ఆర్థిక బడ్జెట్లో కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ అన్నారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం కామేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో భూ నిర్వాసితులకు పరిహారం అందించాలన్నారు.