CTR: కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇవాళ ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కుప్పం, పలమనేరు, నగిరి డివిజన్ పరిధిలో జన గణన చేపట్టే ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు శిక్షణ నిర్వహించనున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. పకడ్బందీగా జన గణన చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీరామనవమి సందర్భంగా పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మార్చి 26న ‘బ్యాండ్ మేళం’, ‘G.O.A.T’, ‘యూత్’ సినిమాలు.. మార్చి 27న ‘సుయోధన’, ‘హ్యాపీ రాజ్’ మూవీలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు మార్చి 27న నెట్‌ఫ్లిక్స్‌లో ‘మర్దానీ 3’, జియో హాట్‌స్టార్‌లో ‘కాట్టాన్’ స్ట్రీ...
SRPT: అనంతగిరి మండలం వాయిల సింగారం చెరువు కట్ట ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు తెగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, పనులు మొదలుపెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
VZM: జనాభా లెక్కలు రెండు దశలలో జరుగుతాయని, మొదటి దశలో బ్లాకుల వారీగా గృహాల లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. రెండవ దశలో జనాభా గణన వచ్చే ఏడాదిలో జరుగుతుందని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్ రూంలో ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం మలుగూరు గ్రామపంచాయతీ బీసీ కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా రోడ్లు అవసరమైన చోట వేయకుండా, ఇప్పటికే ఉన్న పాత రోడ్లపైనే సీసీ రోడ్లు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.
MNCL: అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేసిన బెల్లంపల్లి BJP నాయకులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని ధ్రువీకరించారు. అక్రమ అరెస్టులే ఈ పరిస్థితికి కారణమని BJP నాయకులు ఆరోపించారు.
VZM: తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వేపాడ ఎంఈవో ఎన్.నాగభూషణరావు కోరారు. సోమవారం ఆయన మండలంలోని సోంపురం ఎంపీపీ పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు.
TG: HYD నగరాన్ని ‘లేక్స్ అండ్ రాక్స్’ సిటీగా అభివర్ణించిన సీఎం రేవంత్, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో 2వ స్థానంలో ఉన్న మెట్రో 9వ స్థానానికి పడిపోయిందని, నగరం మరియు రాష్ట్ర రూపురేఖలు మార్చేందుకు ‘క్యూర్, ప్యూర్, రేర్’తో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.
HYD: ఉగాది, రంజాన్ సెలవుల అనంతరం ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ప్రయాణికులు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. దీంతో జూబ్లీ బస్ స్టేషన్ (JBS), ఎంజీబీఎస్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అయితే ‘మహాలక్ష్మీ’ పథకం ద్వారా మహిళలకు సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని TGSRTC అదనపు బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
MHBD: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని MLC తక్కెలపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం HYD గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ MLAలు, MLCలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.
NTR: కంచికచర్ల మండలం కీసర సమీపంలో విద్యుత్ షాక్ ఘటన జరిగింది. అగ్రిగోల్డ్ ప్రాంతంలో విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా ఒక వ్యక్తికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి NH-65 హైవే అంబులెన్స్‌లో బాధితుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
WGL: గీసుకొండ(M)లోని శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. స్వామి వారి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు వెల్లడించారు.
KMM: తల్లాడ మండలం మిట్టపల్లి నుంచి రామనుజవరం వెళ్లే రహదారి భారీ గుంతలు ఏర్పడి కంకర పైకి తేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో గుంతలు కనపడక వాహనాదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,410 పలికింది. అలాగే 341 మిర్చి క్వింటాకు రూ.20,500 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.35వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,450, ఎల్లో మిర్చి రూ.20,500 పలికాయి. మార్కెట్‌లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.
NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ బీజేపీ ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో మరికల్ పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌తో పాటు 10 మంది నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలపై బీజేపీ శ్రేణులు మండిపడ్డారు.