• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పడితే ప్రాణాలు పోతాయ్..!

PPM: సాలూరు మండలం కరాసవలస పంచాయతీ పరిధిలో ఉన్న సిమిడివలస వద్ద రోడ్డుకు మధ్యలో గుంత ఏర్పడింది. రాత్రిపూట ఆ గొయ్యి కనిపించక వాహనదారులు అందులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

March 23, 2026 / 10:29 AM IST

ఉమ్మడి జిల్లాలో 5049 కో ఆప్షన్ పోస్టులు ఖాళీ

WGL: జిల్లాలో 1,684 గ్రామ పంచాయతీల్లో కో-ఆప్షన్ సభ్యుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయిందని ప్రజల ఆరోపించారు. పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం ప్రతి పంచాయతీకి ముగ్గురు చొప్పున 5,049 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు నెలల్లో భర్తీ కావాల్సి ఉన్నా ప్రభుత్వం ఇప్పటివరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. కో-ఆప్షన్ సభ్యులకు వార్డు సభ్యుల హోదా ఉన్నప్పటికీ ఓటు హక్కు ఉండదు.

March 23, 2026 / 10:27 AM IST

ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్ సీజ్

KNR: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను మొగ్దుంపూర్ వద్ద కరీంనగర్ రూరల్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. నారాయణరావుపల్లెకు చెందిన బర్రె సతీష్ తన యజమాని చిగురి సుధాకర్ ఆదేశంతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా పట్టుబడ్డాడు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

March 23, 2026 / 10:24 AM IST

వీరశైవ లింగాయత్ నూతన కమిటీ ఎన్నిక

NRPT: ధన్వాడ మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా శివకుమార్, అధ్యక్షులుగా సురేశ్, ప్రధాన కార్యదర్శిగా వీరప్ప, కోశాధికారిగా బాలరాజ్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా నాయకుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలో సంఘం బలోపేతానికి కృషి చేస్తామని నూతన సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.

March 23, 2026 / 10:23 AM IST

నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీలో బీజేపీ వాయిదా తీర్మానం

HYD: అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై బీజేపీ వాయిదా ప్రతిపాదన నోటీసు ఇచ్చింది. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని కోరారు. ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అత్యవసర అంశంపై చర్చించేందుకు సభ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని అభ్యర్థించారు.

March 23, 2026 / 10:22 AM IST

మంథనిలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

PDPL: “చలో అసెంబ్లీ” కార్యక్రమానికి వెళుతున్న మంథని మండల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టగా, దాన్ని అడ్డుకునేందుకే అరెస్టులు చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్, సబ్బని సంతోశ్, రేపాక శంకర్, ఎడ్ల సాగర్,ఉన్నారు.

March 23, 2026 / 10:21 AM IST

డ్రైనేజీ నిర్మాణం అయిన 10 రోజులకే బీటలు

E.G: గోకవరం మండలం కొత్తపల్లి మేజర్ పంచాయతీలో 10 రోజుల క్రితం నిర్మించిన డ్రైనేజీ అప్పుడే బీటలు వారడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పల్లె పండుగ 2.0’ పథకంలో భాగంగా గ్రామానికి కేటాయించిన రూ.70 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టారు. పనులలో నాణ్యత లోపించిందని అందుకే డ్రైన్లలో బీటలు వచ్చాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

March 23, 2026 / 10:20 AM IST

‘అరుదైన రికార్డు నమోదు చేసిన ప్రధాని మోడీ’

కోనసీమ: భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోడీ మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం అన్నారు. ఇవాళ కొత్తపేటలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా పనిచేసిన నాయకునడిగా అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నారన్నారు. ప్రధాని పదవిలో 8931 రోజులు పూర్తి చేసుకున్నారని తెలిపారు.

March 23, 2026 / 10:20 AM IST

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై BRS నిరసన

HYD: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పెండింగ్ బకాయిల వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గన్‌పార్క్ నుంచి ఫ్లకార్డ్స్‌తో నిరసనగా అసెంబ్లీ వైపు ప్రదర్శనగా బయలుదేరి అక్కడ నిరసన తెలిపారు.

March 23, 2026 / 10:20 AM IST

ఆయిల్ పామ్‌పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: మాజీ మంత్రి

WNP: ఆయిల్ పామ్ సాగుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పరిశ్రమను 16 నెలల్లోనే పూర్తి చేశామని సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారని, మరి వనపర్తి జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఎందుకు పూర్తి కాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

March 23, 2026 / 10:20 AM IST

‘శ్రీశైలంలో కళారాధన ఆకర్షణ’

KRNL: ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం నిత్య కళారాధన వేదికపై ఖమ్మం అభినయ రుద్ర నాట్యాలయం సంప్రదాయ నృత్యంతో అలరించింది. ఈ కార్యక్రమాల్లో హరికథ, బుర్రకథ, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

March 23, 2026 / 10:20 AM IST

వీవో భవన నిర్మాణానికి భూమి పూజ

SRCL: గంభీరావుపేట మండల కేంద్రంలో వీవో (VO) భవన నిర్మాణానికి సర్పంచ్ మల్లుగారి పద్మ సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాలు దోహదపడతాయని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు భాగ్య పాల్గొన్నారు.

March 23, 2026 / 10:19 AM IST

నేడు రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైతులకు నేడు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. జిల్లాల వారిగా వివరాలు ఇలా..MBNR: 2.15 లక్షల రైతులకు ₹104.77 కోట్లుNGKL: 3.01 లక్షల రైతులకు ₹157.95 కోట్లుNRPT:  1.77 లక్షల రైతులకు రూ.93.71 కోట్లుGDWL: 1.68 లక్షల రైతులకు రూ.91.45 కోట్లుWNP:   1.77 లక్షల రైతులకు 86.31 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ కానున్నాయి.

March 23, 2026 / 10:18 AM IST

ఢిల్లీ పేలుడు ఘటన.. 12 ప్రాంతాల్లో NIA సోదాలు

ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు కేసులో NIA సోదాలను ముమ్మరం చేసింది. జమ్మూకాశ్మీర్‌లోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. కుపారా జిల్లా గులూరాలో ఓ వ్యాపారి నివాసంలో సోదాలు చేపట్టింది. కాగా ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే.

March 23, 2026 / 10:16 AM IST

బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్

SRPT: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తిరుమలగిరి మండలం బీజేపీ నాయకులను పోలీసులు సోమవారం ముందస్తు అరెస్ట్ చేశారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జిల్లా నాయకులు మేడబోయిన యాదగిరి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.

March 23, 2026 / 10:16 AM IST