• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రంజిత్ రెడ్డి మాతృమూర్తికి స్పీకర్ నివాళి

VKB: చేవెళ్ల మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి మాతృమూర్తి చంద్రకళమ్మ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ HYD జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రంజిత్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

March 23, 2026 / 12:11 PM IST

రైళ్లలో చోరీలు చేసిన దొంగ అరెస్ట్..!

KDP: ఎర్రగుంట్లలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న రైలులో మహిళ వద్ద బంగారు నగలు చోరీ జరగటంతో.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గుంటూరు-తాడిపత్రి మార్గంలో ధర్మవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేరళకు చెందిన మహమ్మద్ సవాద్‌ను అదుపులోకి తీసుకుని 75 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

March 23, 2026 / 12:10 PM IST

వాహనం లేకున్నా ఇంధన ‘భారం’ తప్పదు!

చమురు ధరల పెరుగుదల అందరిపై ప్రభావం చూపనుంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా భారమై నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. మనం వాడే టూత్‌పేస్ట్, సబ్బులు, పాలిస్టర్ దుస్తుల తయారీలో పెట్రోకెమికల్స్ వాడతారు. ఈ క్రమంలో వాహనం లేకపోయినా చమురు ధరలు సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

March 23, 2026 / 12:10 PM IST

ఆకివీడు సీఐ నియమాకంలో వీడని జాప్యం..!

W.G: ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నియమాకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత సీఐ జగదీశ్వరరావుపై క్రమశిక్షణ చర్యల అనంతరం, 20 రోజులుగా ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రస్తుతం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పూర్తిస్థాయి అధికారిని నియమించడంలో జాప్యం జరుగుతుండటంతో తదుపరి సీఐ ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

March 23, 2026 / 12:09 PM IST

సత్తెనపల్లిలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు

PLD: సత్తెనపల్లిలోని సీపీఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు సోమవారం జరిగాయి. 23 ఏళ్లకే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలు చిరస్మరణీయమని పార్టీ పట్టణ కార్యదర్శి వల్లెం లక్ష్మీ చెన్నకేశవరావు కొనియాడారు. వారి ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

March 23, 2026 / 12:08 PM IST

నేషనల్ పార్కును PPP మోడల్లో అభివృద్ధి చేస్తాం: MLA

అనంతపురం నేషనల్ పార్కును PPP విధానంలో అభివృద్ధి చేసి మూడు నెలల్లో సరికొత్త మార్పులు చూపిస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రకటించారు. శిల్పారామం నుంచి రూ. 2.62 కోట్లతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పార్కు నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు.

March 23, 2026 / 12:05 PM IST

రైతులకు తీరని నష్టం వాటిల్లింది: మంత్రి ఆనం

AP: అకాల వర్షం వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లడం బాధాకరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో పర్యటించిన ఆయన, ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

March 23, 2026 / 12:04 PM IST

పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు

కృష్ణా: 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో సెక్షన్ 144 అమలులో ఉండగా, అనుమతి లేని వ్యక్తులు కేంద్రాల వద్ద గుమికూడరాదని ఎస్సై సత్యనారాయణ సూచించారు.

March 23, 2026 / 12:04 PM IST

‘శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి’

CTR: కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇవాళ ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కుప్పం, పలమనేరు, నగిరి డివిజన్ పరిధిలో జన గణన చేపట్టే ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు శిక్షణ నిర్వహించనున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. పకడ్బందీగా జన గణన చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 23, 2026 / 12:03 PM IST

శ్రీరామనవమి స్పెషల్.. అలరించే చిత్రాలివే..!

శ్రీరామనవమి సందర్భంగా పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మార్చి 26న ‘బ్యాండ్ మేళం’, ‘G.O.A.T’, ‘యూత్’ సినిమాలు.. మార్చి 27న ‘సుయోధన’, ‘హ్యాపీ రాజ్’ మూవీలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు మార్చి 27న నెట్‌ఫ్లిక్స్‌లో ‘మర్దానీ 3’, జియో హాట్‌స్టార్‌లో ‘కాట్టాన్’ స్ట్రీ...

March 23, 2026 / 12:02 PM IST

తెగిపోవడానికి సిద్ధంగా వాయిల సింగారం చెరువు కట్ట!

SRPT: అనంతగిరి మండలం వాయిల సింగారం చెరువు కట్ట ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు తెగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, పనులు మొదలుపెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

March 23, 2026 / 12:01 PM IST

జనాభా గణనపై ఎన్నికల కంట్రోల్ రూంలో శిక్షణ

VZM: జనాభా లెక్కలు రెండు దశలలో జరుగుతాయని, మొదటి దశలో బ్లాకుల వారీగా గృహాల లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. రెండవ దశలో జనాభా గణన వచ్చే ఏడాదిలో జరుగుతుందని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్ రూంలో ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.

March 23, 2026 / 12:00 PM IST

సీసీ రోడ్ల పనులపై గ్రామస్తుల ఆగ్రహం

సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం మలుగూరు గ్రామపంచాయతీ బీసీ కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా రోడ్లు అవసరమైన చోట వేయకుండా, ఇప్పటికే ఉన్న పాత రోడ్లపైనే సీసీ రోడ్లు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

March 23, 2026 / 12:00 PM IST

పోలీస్ స్టేషన్‌లో అస్వస్థతకు గురైన BJP నాయకులు

MNCL: అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేసిన బెల్లంపల్లి BJP నాయకులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని ధ్రువీకరించారు. అక్రమ అరెస్టులే ఈ పరిస్థితికి కారణమని BJP నాయకులు ఆరోపించారు.

March 23, 2026 / 12:00 PM IST

‘వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

VZM: తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వేపాడ ఎంఈవో ఎన్.నాగభూషణరావు కోరారు. సోమవారం ఆయన మండలంలోని సోంపురం ఎంపీపీ పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు.

March 23, 2026 / 11:59 AM IST