PLD: సత్తెనపల్లిలోని సీపీఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు సోమవారం జరిగాయి. 23 ఏళ్లకే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల త్యాగాలు చిరస్మరణీయమని పార్టీ పట్టణ కార్యదర్శి వల్లెం లక్ష్మీ చెన్నకేశవరావు కొనియాడారు. వారి ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.