• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కోహ్లీ రికార్డు బ్రేక్ అవుతుందా..?

IPL చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2016లో కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఏ ఇతర ఆటగాడు కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లోకి రాలేకపోయాడు. మరి ఈ సీజన్‌లోనైనా ఈ రికార్డు బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.

March 25, 2026 / 03:18 PM IST

నూతన తహసీల్దార్‌గా శ్రీనివాసరెడ్డి

KDP: కమలాపురం నూతన తహసీల్దార్‌గా పామిలేటి శ్రీనివాస రెడ్డి బుధవారం ఉదయం తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు రెవెన్యూ పరంగా తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను కలవచ్చని తెలిపారు.

March 25, 2026 / 03:16 PM IST

గ్రోయిన్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన

AKP: ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం వద్ద పెనుగొల్లు గ్రోయిన్ పునర్నిర్మాణ పనులకు ఎంపీపీ వెంకటలక్ష్మి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ పనులకు హోంమంత్రి వంగలపూడి అనిత రూ.99 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. పనులు పూర్తయితే 1,200 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్నారు.

March 25, 2026 / 03:14 PM IST

త్వరలో ఆరోగ్య కేంద్రాల్లో HPV వ్యాక్సినేషన్

MDCL: బోడుప్పల్, నారపల్లి, ఘట్‌కేసర్, మేడిపల్లి పరిసర ప్రాంతాలలోని ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో HPV వ్యాక్సినేషన్ అందుబాటులోకి రానున్నట్లుగా డాక్టర్ సౌందర్యలత తెలిపారు. మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ రాకుండా నిరోధించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం HPV వాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆమె తెలిపారు.

March 25, 2026 / 03:14 PM IST

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి: కలెక్టర్

GDWL: నమూనా ఐక్యరాజ్య సమితి (మోడల్ యూఎన్) సర్వసభ్య సమావేశాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 193 సభ్య దేశాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇది ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

March 25, 2026 / 03:14 PM IST

కమ్యూనిటీ హాలు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరు పల్లెపాలెంలో బుధవారం నూతన కమ్యూనిటీ హాలు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఎంపీ లాడ్స్ నిధులు రూ.30 లక్షలతో ఈ భవనం నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూజలు చేసి పనులు ప్రారంభించారు. మండలి వెంకట్రామ్, తోట కనకదుర్గ, విమల్ కృష్ణ, నాగార్జున పాల్గొన్నారు.

March 25, 2026 / 03:13 PM IST

నెట్వర్క్‌లు ప్రారంభించాలని వినతి

ASR: డుంబ్రిగుడ మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లకు ఇంకా నెట్‌వర్క్ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయకుడు వంతాల గురు నాయుడు అన్నారు. ఈ సమస్యపై బిఎస్ఎన్ఎల్ అధికారులకు వినతిపత్రం బుధవారం అందజేశారు. ఫైబర్ కేబుల్ తెగిపోవడం వల్ల ఆలస్యం జరిగిందని అధికారులు తెలిపారు.

March 25, 2026 / 03:13 PM IST

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన

ప్రకాశం: పొన్నలూరు మండలం మాలపాడు గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ఏదైనా ఇబ్బంది, అసౌకర్యం కలిగితే వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.

March 25, 2026 / 03:12 PM IST

భర్త వరకట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

MDK: తీవ్ర మనస్తాపానికి గురై వడ్ల మమత (26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలం డీ ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. రాయపోల్ మండలానికి చెందిన నరసింహచారితో మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. కాని భర్త వరకట్న వేధింపుల కారణంగా మమత కొంతకాంగా అమ్మగారి ఊర్లో ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

March 25, 2026 / 03:12 PM IST

వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన

SDPT: సిద్ధిపేట అర్బన్ పొన్నాల గ్రామపంచాయతీలో ప్రైవేట్ కళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు బుధవారం ఫీల్డ్ విజిట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీలోని కంపోస్ట్ యార్డును సందర్శించారు. ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను, వ్యర్థాల విభజన, కంపోస్టింగ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో అనుభవం చాలా ఉపయోగపడుతుందన్నారు.

March 25, 2026 / 03:12 PM IST

RTC ప్రయాణికులకు GOOD NEWS

HYD: పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల క్యూ లైన్లను తగ్గించేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీని ప్రకటించింది. వ్యక్తిగత వాహనాల కోసం పెట్రోల్ బంకుల వద్ద వేచి ఉండకుండా, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు. ఈ నిర్ణయం వల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, కాలుష్యం తగ్గుతుందని, సౌకర్యవంతమైన ప్రయాణం దక్కుతుందన్నారు.

March 25, 2026 / 03:11 PM IST

‘పెన్షన్ వాలిడేషన్ చట్టన్ని రద్దు చేయాలి’

NRML:పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ చట్టంతో పాత పెన్షనర్లకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌కు బుధవారం వారు వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసి లింగన్న, ప్రధాన కార్యదర్శి పోత రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

March 25, 2026 / 03:11 PM IST

‘అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం’

కోనసీమ: వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరమని జిల్లా ఫైర్ ఆఫీసర్ పార్థసారథి అన్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి నేటి వరకు 66 అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు. కోట్లల్లో నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు పలు ఆసుపత్రులు, పరిశ్రమలు తనిఖీలు చేసి,  ప్రమాదాలు జరగకుండా పూర్తి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

March 25, 2026 / 03:11 PM IST

‘బొలిశెట్టికి మా పార్టీతో సంబంధం లేదు’

VSP: బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబందం లేదని జనసేన కార్యలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బొలిశెట్టి తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించి పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు తెలిపింది. పర్యావరణానికి సంబంధించి హైకోర్టులో కొనసాగుతున్న పిల్ నేపథ్యంలో జనసేన నుంచి ఆయన వైదొలిగిన విషయం తెలిసిందే.

March 25, 2026 / 03:11 PM IST

‘1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు’

VZM: జిల్లా వ్యాప్తంగా మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆసక్తి గల గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు, శిక్షకులు తమ ప్రతిపాదనలను ఈ నెల 28లోపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో సమర్పించాలన్నారు. వివరాలకు 8074116276, 9491767327 నంబర్లను సంప్రదించాలని కోరారు.

March 25, 2026 / 03:11 PM IST