భారత్ UPI సేవలు మరిన్ని దేశాలకు విస్తరించనున్నాయి. తాజాగా మరో 8 దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు వెల్లడించారు. ప్రస్తుతం సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఖతార్, యూఏఈ, మారిషస్ దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా యూపీఐ లావాదేవీలను అనుమతించేలా మరో 7-8 దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని నాగరాజు తెలిపారు.