ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. విశాఖ-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకపల్లి సమీపంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది.
Breaking news: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. విశాఖ-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకపల్లి సమీపంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. విశాఖ-రాయగడ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలు ఓవర్ హెడ్ కేబుల్ వైరు తెగిపోవడంతో పట్టాలపై ఆగిపోయింది. పట్టాలపై ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ బోగీల్లో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికుల్లో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. చాలా మంది గాయపడ్డారు. కరెంటు లేకపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారుతున్నాయి. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని సీఎం ఆదేశించారు. మంచి వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేయాలన్నారు.