NGKL: చారకొండ మండలంలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆయన, ఆలయ అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించామని వెల్లడించారు.