హీరో గోపీచంద్ హిట్ పడి చాలా కాలమే అవుతోంది. అందుకే ఎలాగైనా సరే.. ఈసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని అనుకుంటున్నాడు ఈ మ్యాచో మ్యాన్. తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా డైరెక్టర్ శ్రీవాస్‌తో కలిసి.. రామబాణంగా(Ramabanam) వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత.. గోపీకి హిట్ ఖాయమనే టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాను తన ఫ్రెండ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)తో ప్రమోట్ చేయించి ఉంటే.. ఇంకా భారీ హైప్ వచ్చేది. కానీ గోపీచంద్(gopichand) అలా చేయనని చెబుతున్నాడు.
లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ చేసిన సినిమా ‘రామ బాణం'(Ramabanam). ఈ సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు శ్రీవాస్. గోపీచంద్ సరసన ఖిలాడి బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, గోపీ అన్నగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 5న ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో.. ఇప్పటికే ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ క్రమంలో రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్(pre release event)ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఏప్రిల్ 30న హైదరాబాద్(hyderabad)లోని జేఆర్సీ కన్వేన్షన్ హాల్లో.. సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయనున్నారు మేకర్స్.
అయితే గోపిచంద్, ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఈ సినిమా ఈవెంట్‌కు ప్రభాస్(prabhas) చీఫ్ గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉందని.. ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ భావించారు. గోపీచంద్ పిలిస్తే.. ప్రభాస్ రానని చెప్పే ఛాన్సే లేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.
అందుకే.. ఎంత స్నేహితుడు అయిన తనని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదని అన్నాడు గోపీచంద్(gopichand). దాంతో రామబాణం ఈవెంట్‌కు అతిథిగా ప్రభాస్ మిస్ అయ్యాడనే చెప్పాలి. లేదంటే.. ఆ హంగామా, ఆ హైప్ వేరే లెవల్లో ఉండేది. మరి ఈ సినిమా అయినా.. గోపీచంద్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.