బాలాసోర్ రైలు దుర్ఘటన తర్వాత పునరుద్ధరణ పనులు జరిగిన వెంటనే ఒడిశా(odisha)లో మరో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన బార్ఘర్ జిల్లా(Bargarh district)లో నమోదైంది. బర్గర్లో సున్నపురాయిని తీసుకెళ్తున్న గూడ్స్ రైలులోని పలు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భారతదేశంలో జరిగిన అత్యంత వినాశకరమైన రైలు ప్రమాదంలో ఒకటైన కోరమాండల్ విషాదం జరిగిన మూడు రోజుల తర్వాత తాజాగా గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ‘సిగ్నలింగ్ వైఫల్యం’ వల్ల జరిగిన ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే సిఫారసు చేశారు.