MDCL: మేడిపల్లి మండల పరిధిలో పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MEO శ్రీనివాస్ రెడ్డి ఇవాళ తెలిపారు. 15 పరీక్ష కేంద్రాలు, 225 మంది సిబ్బందితో పరీక్షలు పూర్తి సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2,835 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారని, విద్యార్థుల వస్తువులు భద్రపరిచుటకు క్లోక్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.