ప్రతికూల వాతావరణం నేపాల్ ప్రజలకు పెను సమస్యగా మారింది. ఈరోజు అంటే శుక్రవారం ఉదయం మధ్య నేపాల్‌లోని మదన్-ఆషిర్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో సుమారు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి.
న్యూయార్క్‌లోని సిరక్యూస్ హాన్కాక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలకు గాల్లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాల్లో ఉన్న 159మంది తృటిలో తప్పించుకున్నారు.
అర్హత లేకున్నా రైతు బంధు తీసుకున్న వారి గుండెల్లో పిడిగుపడే వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయేత భూమిపై తీసుకున్న రైతుబంధు నిదులు వెనక్కి ఇవ్వాలని ఓ రైతుకు నోటీసులు పంపించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు ఆందోళన చెంద
హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద హాష్ ఆయిల్, వీడ్ ఆయిల్ విక్రయిస్తున్న డ్రగ్ డీలర్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర స్వాధీనం చేసుకున్న సరకు లక్షల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 50 మందికి పైగా పెళ్లిళ్లు చేసుకోవడం లేదా వారిని నమ్మించి మోసం చేసి వారి ఇళ్లలోంచి లక్షల విలువైన నగదు, నగలు తీసుకుని ఓ మహిళ ఉడాయించింది.
పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవని బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి.
యూట్యూబర్, నామ్ తమిళర్ కట్చి (NTK) నాయకుడు 'సత్తాయ్' దురైమురుగన్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎంకె పితామహుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధిపై ఆయన అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు పోలీసు బృందం గురువారం అదుపులోకి తీసుకుంది
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో భూ వివాదంలో మరోసారి భూమి నెత్తుటితో తడిసిపోయింది. అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్లీ పంచాయతీ గీలాపురా గ్రామంలో ప్రభుత్వ భూమిని దున్నడంపై ఇరువర్గాల మధ్య వివాదం జరిగింది.
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ గాలిస్తున్న వ్యక్తి రాకీని ఎట్టకేలకు జార్ఖండ్‌లో అరెస్టు చేశారు. అతడిని ఈరోజు పాట్నా కోర్టులో హాజరుపరిచారు. రాకీకి కోర్టు 10 రోజుల పాటు సీబీఐ రిమాండ్ కు ఇచ్చింది కోర్టు.