ప్రకాశం: పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ పామూరు పట్టణంలో బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కొవ్వొత్తులు వెలిగించి మృతులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కనిగిరి బీజేపీ ఇంఛార్జి కొండిశెట్టి వెంకటరమణయ్య మాట్లాడుతూ.. పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా దాడులు చేయడం పిరికిపంద చర్య అన్నారు.