GNTR: SSC ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రాణించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు పోటీ పెరిగింది. మెరుగైన సౌకర్యాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు ఆసక్తి చూపుతున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి పథకాలు పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి.