AP: లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిని సిట్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతని నుంచి పూర్తి సమాచారం రాలేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్ కసిరెడ్డిని వారంరోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. రూ.3,200 కోట్ల కమీషన్ల ముడుపుల వ్యవహారంలో అతడు కీలక నిందితుడని అధికారులు పేర్కొన్నారు.