VZM: బొబ్బిలి మండలం పారది వద్ద బుధవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రెవిన్యూ అధికారులు నిఘా పెట్టి రెండు ట్రాక్టర్లు, జేసీబీతో పట్టుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నందున ట్రాక్టర్లు జేసీబీను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆర్ఐ కొల్లి రామ్ కుమార్ తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని అన్నారు.