KMM: జిల్లా కల్లూరు మండలానికి చెందిన బాణోతు నాగరాజు నాయక్ UPSC సివిల్స్‌లో 697వ ర్యాంక్ సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. మూడెకరాల పొలం సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లిదండ్రుల కుమారుడిగా నాగరాజు చిన్ననాటినుండి పట్టుదలతో నవోదయ పాఠశాల, విజయవాడలో ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి, 2020 నుంచి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు.