PPM: జిల్లాలో అవసరమైన చోట్ల నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాలన్నారు. ఓటర్ల జాబితా స్వచ్చీకరణలో భాగంగా బీఎల్ఓలకు సంపూర్ణ సహకారం అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని పేర్కొన్నారు.