JGL: ఆత్మరక్షణకు తైక్వాండో ఎంతో ఉపయోగపడుతుందని జగిత్యాల ఛైర్పర్సన్ వాణి తెలిపారు. జగిత్యాల టౌన్ హాల్లో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోటీలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అవసరమని, తైక్వాండో ద్వారా క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మస్థైర్యం పెరుగుతాయన్నారు.