BHPL: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున ఘటన పలిమెల మండలంలో చోటు చేసుకుంది. అప్పాజిపేటకు చెందిన సంజన (16) గంగారాంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో పెయిల్ కావడంతో మనస్తాపం చెందిన సంజన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.