ప్రకాశం: రేపు మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కొండపిలో పర్యటిస్తన్నట్లు అతిని అనుచరులు తెలిపారు. ఉదయం 9 గంటలకు కొండపిలోని పొగాకు వేలం కేంద్రంను సందర్శించి పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు పొన్నలూరు మండలం సుంకిరెడ్డి పాలెంలో నిర్వహిస్తున్న తిరుపతమ్మ తిరునాళ్ళలో పాల్గొంటారని వారి కార్యాలయ సిబ్బంది తెలిపారు.