సత్యసాయి: కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని నిరసిస్తూ హిందూపురంలో YCP నేతలు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, దీపిక తదితర నేతలు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ప్రజలపై ఉగ్రవాదుల దాడిని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు.