ATP: తమ దాడులతో భారతదేశంలో సమైక్యతను దెబ్బతీయాలనే ఉగ్రవాదుల క్రూరమైన ఆలోచనలు ఇక్కడ చెల్లవని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాది దాడి చేసి 28 మందిని హతమార్చడంపై ఆయన బుధవారం తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు ఎన్డీఏ ప్రభుత్వం దిటైన జవాబు ఇస్తుందని దాడులతో దేశ సమైక్యతను దెబ్బతీయలేరన్నారు.