SKLM: శ్రీకాకుళం పట్టణంలోని పాలకొండ రోడ్డులో గల శ్రీ విజయ గణపతి ఆలయంలో బుధవారం రాత్రి స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు పెంట శ్రీధర్ శర్మ నేతృత్వంలో ఆలయాన్ని దీపాలతో అలంకరణ చేశారు. అనంతరం పూజాది కార్యక్రమాలు చేపట్టారు. నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.